
ఐపీఎల్ 2025లో ఈరోజు రసవత్తర పోరు జరగనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే ఈ మ్యాచులో టాస్ నెగ్గిన సూపర్ కింగ్స్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న చెన్నై కనీసం ఈ మ్యాచులోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచులో ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది. అటు ప్లే ఆఫ్స్ అవకాశాలను పటిష్ఠం చేసుకోవాలని పట్టుదలతో ఆర్సీబీ భావిస్తోంది. కోహ్లీ, పడిక్కల్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ మ్యాచులో ఆర్సీబీ ఒక మార్పు చేసింది. జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో లుంగీ ఎంగిడిని జట్టులోకి వచ్చాడు.
HUGE CHEER FOR MS DHONI AFTER WIN THE TOSS AT CHINNASWAMY..!!!! 🦁#RCBvsCSK #CSKvsRCB #RCBvCSK #IPL2025 pic.twitter.com/V8euw6C8gR
— RO_KO fanclub🏏 (@MohammadFa83199) May 3, 2025
సీఎస్కేదే పైచేయి
ఈ సీజన్‌లో ఆర్సీబీ మంచి ఫైర్ మీద ఉన్నప్పటికీ ఓవరాల్ రికార్డ్‌లలో మాత్రం చెన్నైదే పైచేయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐపీఎల్ చరిత్రలో 35 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఆర్సీబీ కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా, సీఎస్కే 21 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇంకో మ్యాచ్ ఫలితం తేలలేదు.
తుది జట్లు ఇవే..
Royal Challengers Bengaluru: జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(C), జితేష్ శర్మ(Wk), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎన్గిడి, యశ్ దయాల్.
Chennai Super Kings: షేక్ రషీద్, ఆయుష్ మ్హత్రే, సామ్ కుర్రాన్, రవీంద్ర జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, MS ధోని(Wk/C), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరణ.
The Southern Derby Its RCB VS CSK
CSK WON THE TOSS AND ELECTED TO BOWL FIRST #RCBvsCSK #RCBvCSK pic.twitter.com/jtADSXqz1s
— CricketGram (@cricket_gram) May 3, 2025