
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ (BC Reservation Bill), తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉండటం వల్ల పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని సీఎం (CM Revanth Reddy) అన్నారు. దానికి పరిష్కారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నట్లు తెలిపారు.
Updates from #Telangana Assembly Budget Sessions
Chief Minister @revanth_anumula has announced that newly renovated #Cherlapally Railway terminal would be renamed as #PottSreeramulu terminal.
A letter in this regard would be written to Union Ministers… pic.twitter.com/lArxc1BV1Y
— NewsMeter (@NewsMeter_In) March 17, 2025
తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు
అలాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapally Railway Terminal)కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నట్లు గుర్తి చేసిన ఆయన.. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి (Suravaram Pratap Reddy) పేరు పెడుతున్నట్లు చెప్పారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు
చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)కు లేఖ రాస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇలా ఆయన మనకోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందామని చెప్పారు. మరోవైపు సుదీర్ఘ అనుభవం గల నేత. గవర్నర్‌గా, సీఎంగా ఎన్నో సేవలందించిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Former CM Roshaiah) పేరును బల్కంపేట్‌లో నేచర్ క్యూర్ ఆస్పత్రికి పెట్టనున్నట్లు వెల్లడించారు. ఆ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.