రష్మిక మూవీకి నిరసనల సెగ.. ఆ సీన్లు తొలగించాలని డిమాండ్

గత ఏడాది యానిమల్, పుష్ప-2 చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna). ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌ స్టార్ హీరో విక్కీ కౌశల్‌‌(Vicky Kaushal)తో కలిసి లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ పీరియాడిక్‌ డ్రామా ‘ఛావా(Chhaava)’. ఛత్రపతి శివాజీ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) ఈ పీరియాడిక్ చిత్రాన్ని రూపొందించాడు.

ట్రైలర్‌లో సీన్లపై అభ్యంతరాలు

ఈ సినిమాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్(Chhatrapati Sambhaji Maharaj) భార్య మహారాణి యేసుబాయి(
Maharani Yesubai) పాత్రలో రష్మిక మందన్న నటించింది. ఇటీవల ముంబయిలో ఈ సినిమా ట్రైలర్‌(Trailer) రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్​గా నిర్వహించారు. వాలంటైన్స్ స్పెషల్‌గా ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ట్రైలర్ పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్రపతి శివాజీ వారసులు సినిమా చారిత్రక స్పష్టత, కచ్చితత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. అంతే కాకుండా కొందరు మరాఠీలు ‘ఛావా’ సినిమాపై నిరసనలు(protests) వ్యక్తం చేస్తూ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఈ సినిమాను ముందుగా చరిత్రకారులకు చూపించాలని MH మంత్రి ఉదయ్ సమంత్(Uday Samant) డిమాండ్ చేశారు.

'ఛావా' నయా పోస్టర్

అది శంభాజీ వ్యక్తిత్వానికి విరుద్ధం

కొన్ని మరాఠా సంఘాలు(Maratha Communities) పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో ‘ఛావా’ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. ఇప్పుడు విడుదలైన ‘ఛావా’ సినిమా ట్రైలర్‌లో ఓ డ్యాన్స్ సీన్(Dance Scene) ఉంది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ డ్యాన్స్ చేస్తున్న సీన్ ఇదే, మరాఠీ ప్రజలు ఈ సీన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మహారాజ్ బహిరంగంగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యం అతని వ్యక్తిత్వానికి విరుద్ధంగా ఉందని. సినిమాలో చూపించినట్లుగా, పట్టాభిషేకం తర్వాత ఇలా డ్యాన్స్ చేస్తూ చూపించారు. ఆ సీన్‌ను సినిమా నుంచి తొలగించాలని పట్టుబడుతున్నారు. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో.. సినిమాలో ఎలాంటి మార్పులు చేస్తారో అనేది తెలియాల్సి ఉంది.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *