YCP మాజీ నేత, రాజ్యసభ మాజీ MP విజయసాయిరెడ్డి(Vijayasai Reddy)కి ఏపీ సీఐడీ(AP CID) నోటీసులిచ్చింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ (KSPL), కాకినాడ సెజ్ (K-Sez)లలో రూ. 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (KV Rao) నుంచి బలవంతంగా లాక్కున్నట్టు విజయసాయి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈ కేసులో రేపు (Mar 12) ఉదయం విజయవాడ CID ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నోటీసులు(Notice) ఇచ్చేందుకు రెండు రోజుల క్రితం అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. విజయసాయి లేకపోవడంతో ఆయన భార్యకు నోటీసులు అందజేశారు.
రెండు నెలల క్రితమే విచారించిన ఈడీ
కాగా, ఈ కేసులో విజయసాయిరెడ్డి A2 నిందితుడు కాగా, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి A1గా ఉన్నారు. ఈ కేసులో మనీలాండరింగ్(Money laundering) కూడా జరిగినట్టు గుర్తించిన ఈడీ.. రెండు నెలల క్రితమే విజయసాయిరెడ్డిని విచారించింది. ఇప్పుడు ఇదే కేసులో విచారణకు సీఐడీ రంగంలోకి దిగింది.
ఇదిలా ఉండగా YSRCP మాజీ నేత విజయసాయి రెడ్డి ఇటీవలే రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. అలాగే రాజ్యసభ సభ్యత్వాని(Rajya Sabha Membership)కి కూడా ఆయన రాజీనామా(Resignation) చేశారు. తన నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమని భవిష్యత్తులో ఏ పార్టీలోనూ చేరనని ఆయన ఇది వరకే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయం చేసుకుంటున్నట్లు సమాచారం.








