ఏపీని నాలెడ్జ్ హబ్(AP Knowledge Hub)గా మారుస్తామని CM చంద్రబాబు వెల్లడించారు. వ్యవసాయంలో టెక్నాలజీ(Technology) ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. IT గురించి ఎవరు మాట్లాడినా హైటెక్ సిటీ(High Tech City)ని ప్రస్తావించకుండా ఉండలేరన్నారు. ఇఫ్పుడు డీప్ టెక్నాలజీ(DeepTech) సరికొత్త ఆవిష్కరణ కానుందని వివరించారు. ప్రపంచంలో నలుగురు IT ప్రొఫెషనల్స్‌లో ఒకరు భారతీయులే ఉన్నారని CM తెలిపారు. ఇవాళ విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్(DeepTech Conclave in Vizag) నిర్వహించారు. ఈ మేరకు సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో మాట్లాడారు. 2014- 19 మధ్య AP గ్రోత్ రేట్ 13% ఉందని, ప్రస్తుతం 15% టార్గెట్‌గా పనిచేస్తున్నామని వెల్లడించారు.
పేదరిక నిర్మూలన(Eradication of poverty) ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని చంద్రబాబు అన్నారు. ఉపాధి(employment) కల్పించే వారికి ప్రభుత్వ ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. అన్ని రకాల విద్యాసంస్థలు ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతామన్నారు. ఫుడ్ సప్లై(Food Supply)కి కూడా AP గ్లోబల్ హబ్‌గా నిలిచిందన్నారు. సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను CM పరిశీలించారు.
ఎక్కడైన చూసినా టెక్నాలజీపైనే చర్చ
ప్రపంచంలో ఎక్కడైనా టెక్నాలజీపైనే చర్చ జరుగుతోందని, టెక్నాలజీలో అనేక కొత్త మార్పులు వస్తున్నాయన్నాయి. ప్రస్తుతం జీవితంలో టెక్నాలజీ ఓ భాగంగా మారిందన్నారు. భారత్(India)లో మాత్రమే ఆధార్(Aadhar) ఉందన్నారు. దీని అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయన్నారు. సెల్ ఫోన్(Phone) చేతిలో ఉంటే మనమంత వండర్స్ క్రియేట్ చేయవచ్చనని CM తెలిపారు.
We are truly honored to have participated in the DeepTech/GovTech Innovation Conclave 2024, an inspiring two-day event organized by the Global Forum for Sustainable Transformation (GFST) in collaboration with the state government of Andhra Pradesh. #DeepTech #GovTech pic.twitter.com/CPvfQHHjLT
— Transasia Bio-Medicals (@Transasia_1) December 6, 2024






