దేశం మొత్తం మీద పుష్ప-2 చిత్రం ఒక ఊపు ఊపేస్తుంది. రిలీజ్ అయిన ప్రతి చోటా అనుహ్యమైన ప్రేక్షక ఆదరణ పొందుతోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ప్రతిచోట కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాకు ఎక్కువగా థియేటర్లు కేటాయించడంపై ఉత్తరాదిన కొంచెం అసహనం వినిపిస్తుంది. పుష్ప మూవీకి ఎక్కువగా థియేటర్లు కేటాయించడంతో ఇంటర్ స్టెల్లార్ మూవీ రీ రిలీజ్ వాయిదా పడిందని విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఈ అంశంపై బాలీవుడ్(Bollywood) నటి జాన్వీ కపూర్ స్పందించారు.
పుష్ప 2కు ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై విమర్శలు
హాలీవుడ్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ తీసిన ఇంటర్ స్టెల్లార్(Interstellar) విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రీ రిలీజ్ చేయడానికి ఆ చిత్రం యూనిట్ భావించింది. అయితే పుష్ప-2 చిత్రానికి ఎక్కువగా ఐమాక్స్ థియేటర్లు కేటాయించడంతో ఇండియాలో ఇంటర్ స్టెల్లార్ సినిమా వాయిదా పడింది. దీంతో కొంతమంది పుష్ప-2(Pushpa-2) చిత్రానికి ఎక్కువగా థియేటర్లో కేటాయించడం ఏంటని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఒక మీమ్స్ పేజ్ పోస్ట్ పెట్టింది. దీనికి జాన్వీకపూర్ రిప్లై ఇస్తూ.. పుష్ప మూవీకి సపోర్ట్ చేశారు. పుష్ప-2 కూడా మన సినిమానే కదా ఎందుకు వేరే సినిమాలతో పోలుస్తూ మన మూవీలను మనమే తక్కువ చేసుకుంటున్నాం. మీరు ఏదైతే హాలీవుడ్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారో వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను, మన ఇండస్ట్రీని ఎప్పుడూ తక్కువ చేసుకుంటూ.. అవమానించుకుంటూ పోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుందని జాన్వికపూర్ రిప్లై సారాంశం. తెలుగు సినిమాకు జాన్వి కపూర్(Jahnvi Kapoor) మద్దతు ఇవ్వడంపై ఆమెను ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా కామెంట్ చేశారని మెచ్చుకుంటున్నారు.
జాన్వీ రామ్ చరణ్ కాంబినేషన్‌లో..
ఇక జాన్వి కపూర్ దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన-రామ్ చరణ్ కలయికలో వస్తున్న RC16 (ప్రచారంలో ఉన్న పేరు) సినిమాలో మీ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్(AR Rahman) స్వరాలు సమకూరుస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.






