CM Revanth: BRS అధినేత కేసీఆర్‌కు సీఎం రేవంత్ బర్త్ డే విషెస్

ప్రజాకేత్రంలో వారిద్దరూ శత్రువులే.. ఎన్నికల రణరంగంలో ఇద్దరూ ప్రధాన పోటీదారులే.. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారివి. ఎవరి సిద్ధాంతాలు వారివి. అయితేనేం.. ఒకరిపట్ల ఒకరికి గౌరవం.ఆ ఇద్దరే తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(BRS chief Kalvakuntla Chandrasekhar Rao), తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నేడు కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Wishes to KCR) తెలిపారు.

‘గజ్వేల్ నియోజకవర్గ MLA, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అని సీఎం రేవంత్ ట్వీట్(Tweet) చేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం తెలిపారు.

కాగా అంతకుముందు KCRకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా రేవంత్ యశోద ఆసుపత్రికి వెళ్లి మరీ ఆయనను పలకరించారు. ఈ విషయంలో ఆయనకు తెలంగాణ ప్రజానీకం వందకు వంద మార్కులు వేసింది. తాజాగా విష్ చేయడంతో మరోసారి రేవంత్‌ను కొనియాడుతున్నారు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆపార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

Chief Minister Revanth Reddy visits former CM KCR at Yashoda hospital - The Hindu

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *