
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) మూడు రోజుల పాటు చర్చ జరిపింది. ఇక ఆదివారం రాత్రి 1.30గంటలు అంటే సుమారు 9 గంటలపాటు సుధీర్ఘంగా ఈ నివేదికపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కమిషన్ నివేదికలోని పలు అంశాలను ప్రస్తావించారు. ఇక కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తు కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI)కు అప్పగించనున్నట్లు సీఎం రేవంత్ ప్రకటన చేశారు.
#Telangana CM #RevanthReddy Has Decided To Handover The #KaleshwaramProject Case To #CBI pic.twitter.com/AtjAUkeBje
— BNN Channel (@Bavazir_network) August 31, 2025
అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా, MIM MLA అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అంశాలకు తెలంగాణ సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవినీతి, అవకతవకల అంశాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని, తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు. ఎవరినీ వదిలేది లేదు. అవినీతిపరులపై చర్యలకు సరైన నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి బయటకు వెళతాం. నిజాం ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరు కాగా, గత బీఆర్ఎస్ పాలకులు అంబానీ, అదానీ కంటే ఎక్కువ సంపాదించాలనే ఆశతో సొంత నిర్ణయాలతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టారని” తీవ్ర విమర్శలు చేశారు.
లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది
‘‘లక్ష కోట్ల ప్రజాధనం వృథా అయ్యింది. నీటి కోసం పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. బంగారం కంటే నీరు మాకు ముఖ్యమైంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లపై ఇప్పటికే విచారణ చేపట్టాం. జస్టిస్ పీసీ ఘోష్ అనుభవం ఉన్న న్యాయమూర్తి. అనేక తీర్పులు ఇచ్చిన ఆయనకు కాగ్, విజిలెన్స్, ఇతర దర్యాప్తు సంస్థల నివేదికలు అందించాం. ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
రూ. 80,000 కోట్ల నుంచి రూ. 1.5 లక్షల కోట్లకు పెరిగింది..
కాగా కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణలోని 20 జిల్లాల్లో 45 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం KCR నాయకత్వంలో అనేక లోపాలు జరిగినట్లు ఘోస్ కమిషన్ తన 650 పేజీల నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ఖర్చు రూ. 80,000 కోట్ల నుంచి రూ. 1.5 లక్షల కోట్లకు పెరిగినట్లు, డిజైన్, నిర్మాణంలో లోపాలు, నీటి నిల్వ సామర్థ్యం మించి నిర్మాణం జరిగినట్లు నివేదిక వెల్లడించింది. నీటిపారుదల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో నివేదికను సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం, గత ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులను పట్టించుకోకుండా, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని కొనసాగించినట్లు అసెంబ్లీ తేలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కూడా మేడిగడ్డ బ్యారేజీలో లోపాలను గుర్తించింది.
LIVE: Sixth Session of Telangana Legislative Assembly Day 2 https://t.co/raegmvc6ow
— Telangana CMO (@TelanganaCMO) August 31, 2025