OGH: ఉస్మా‘నయా’ ఆస్పత్రికి ముహూర్తం ఫిక్స్.. నేడు సీఎం రేవంత్ శంకుస్థాపన

నిజాం కాలం నాటి ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital).. సరికొత్త నయా హాస్పిటల్‌గా మారబోతుంది. అంతర్జాతీయ సొబగులతో.. అధునాతన హంగులతో.. కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు(Medical services) అందించడమే లక్ష్యంగా ఉస్మానియా ఆసుపత్రిని సరికొత్త(Osmania New Hospital)గా నిర్మించబోతోంది తెలంగాణ గవర్నమెంట్(Telangana Govt). ఈ రోజు ఉదయం 11:55 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర అధికారులు హాజరుకానున్నారు.

Osmania Hospital : ఉస్మానియా ఆస్పత్రి భవనం సురక్షితం కాదు : నిపుణుల కమిటీ | An expert committee has concluded that the building of Osmania Hospital in Hyderabad is not safe | An expert committee

అత్యాధునిక హంగులతో.. కార్పొరేట్ స్థాయిలో..

ఉస్మానియా ఆసుపత్రి దశాబ్దాలుగా తెలంగాణ, AP, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు వైద్య సేవలందిస్తోంది. ప్రస్తుతం అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఆసుపత్రి బదులుగా గోషామహల్ స్టేడియం(Goshamahal Stadium)లో 26 ఎకరాల్లో, 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించబోతున్నారు. 2,000 పడకల సామర్థ్యంతో, కార్పొరేట్ స్థాయిలో ఉండేలా ఆసుపత్రిని నిర్మించనుంది. సర్కార్ ప్రతిపాదించిన లే అవుట్ ప్రకారం.. మొత్తం 8 గేట్లు ఉండబోతున్నాయి. ఇందులో మూడువైపుల నుంచి ఆస్పత్రిలోకి ఎంటర్ అయ్యేలా మూడు గేట్లు ఉంటాయి. ఇవికాకుండా.. సర్వీస్‌ గేట్, మార్చురీ గేట్, హాస్టల్‌ గేట్, హాస్టల్&అకడమిక్ గేట్, అకడమిక్ గేట్ సపరేట్‌గా ఉన్నాయి.

Representational image of Osmania General HospitalRepresentational image of Osmania General Hospitalరాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు

అంతేకాదు.. 2500 కోట్లతో 14 అంతస్తుల్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్‌(World class facilities)తో ఉస్మానియా హాస్పిటల్‌ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్త ఉస్మానియా ఆస్పత్రిని 30 డిపార్ట్‌మెంట్లు, నర్సింగ్(Nursing), డెంటల్, ఫిజియో థెరపీ కాలేజీలతో పాటు 750 సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం(A huge auditorium) నిర్మించనున్నారు. జీ+12గా బాయ్స్ హాస్టల్‌, ఫ్యాకల్టీ రెసిడెన్షి, గర్ల్స్‌ హాస్టల్ కూడా హాస్పిటల్ ప్రాంగణంలోనే ఉండేలా డిజైన్ చేశారు. రాబోయే వందేళ్ల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు ఉస్మానియా ఆసుప‌త్రిని నిర్మించనున్నట్లు CM రేవంత్ ఇటీవల జరిపిన సమీక్షలో తెలిపారు. దీంతో పేదలకు, మధ్యతరగతి వారికి వైద్యసేవలు మరింత సులభం కానున్నాయి.

New building works of OGH to begin soon

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *