కాసేపట్లో బీసీ నేతలతో సీఎం రేవంత్ భేటీ.. 42% రిజర్వేషన్లపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కాసేపట్లో BC నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌(Praja Bhavan)లో జరగనుంది. ఈ భేటీలో TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, బీసీ నేతలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా బీసీ నేతలకు రేవంత్ రెడ్డి స్పష్టమైన మార్గనిర్దేశం చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగణన(Caste Census) చేపట్టడం, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

స్పష్టమైన కార్యాచరణ రూపొందిస్తుందా..

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందనే సంకేతాలను బలంగా చాటేందుకు ఈ భేటీ ద్వారా కాంగ్రెస్ నాయకత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను రూపొందించనుంది. భేటీలో భాగంగా బీసీ రిజర్వేషన్లు (BC Reservations), ఎస్సీ ఉప కులాల వర్గీకరణ (Classification of SC Sub-castes) చట్టాల కోసం మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ (Assembly) ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించనున్నారు. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆ సామాజికవర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *