
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్(Cricket Fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. రేపు (ఫిబ్రవరి 23) దుబాయ్(Dubai) వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ (India vs Pakistan) తలపడనున్నాయి. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్(Ban)పై గెలిచి ఊపు మీదున్న రోహిత్ సేనను ఎదుర్కోవడం పాక్‌కు సవాలే. ఒకవేళ ఈ మ్యాచులో పాకిస్థాన్ ఓడిపోతే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) నుంచి నిష్ర్కమిస్తుంది. ఆ జట్టు ఇప్పటికే తొలి మ్యాచులో కివీస్(NZ) చేతిలో 60 పరుగుల తేడాతో ఓడింది. కాబట్టి రేపు పాక్ తప్పక నెగ్గాల్సిన పరిస్థితి. మరోవైపు తొలి మ్యాచులో ఆలౌ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్‌ను పాక్ నిలువరించడం అంత సులువు కాదని టీమ్ఇండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) అన్నారు.
పాక్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి
భారత్ అన్ని విభాగాలలో బలంగా ఉందని, పాక్ జట్టులో చాలా సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. “పరిమిత ఓవర్ల క్రికెట్(ODI)లో పాకిస్థాన్ పూర్తిగా వెనుకబడింది. మోడర్న్ డే క్రికెట్ ఆడటంలో ఆ దేశ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. ఆ జట్టులోని సీనియర్ ప్లేయర్లు(Senior players) తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. వారి ఆట ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో వారి ఆటతీరును అందరూ చూశారు’’ అని అన్నారు.
ఒత్తిడిని తట్టుకున్నవాళ్లదే గెలుపు
ఇక దాయాదుల పోరులో భావోద్వేగం, ఒత్తిడి(Pressure) అనేవి కామన్. ఎవరు వాటిని సరిగ్గా హ్యాండిల్ చేస్తారో వారే విజేతగా నిలుస్తారు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్(ENG)తో జరిగిన సిరీస్ లో ఒత్తిడిలోనూ భారత్ అద్భుతంగా ఆడింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు భారత్‌కు చాలా మంది ఉన్నారు. గాయం తర్వాత కమ్‌బ్యాక్ చేసిన మహ్మద్ షమీ(Shami) తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లతో సత్తాచాటాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్(Gill) భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. రోహిత్(Rohit), విరాట్ కోహ్లీ(Virat Kohli) రన్స్ కొట్టడం మొదలు పెడితే వారిని ఆపడం ఎవరితరం కాదు” అని పఠాన్ చెప్పుకొచ్చాడు.