
హనుమాన్(Hanuman) మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నాడు తేజా సజ్జ(Teja Sajja). చిన్నతనం నుంచే టాలీవుడ్(Tollywood)లో మంచి గుర్తింపు పొందిన ఈ యంగ్ హీరో.. హనుమాన్ సినిమాతో మరోస్థాయికి వెళ్లాడు. కలెక్షన్ల(Collections) పరంగానూ ఆ మూవీ రికార్డులు సృష్టించింది. తాజాగా తేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్(Mirai)’. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) తెరకెక్కిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People’s Media Factory) నిర్మిస్తోంది. ఈ మూవీలో తేజాకు జోడీగా రితికా నాయక్(Rithika Nayak) సందడి చేస్తోంది. స్టార్ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) కీ రోల్ పోషిస్తున్నాడు.
Mark the date.#MIRAI ~ 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏, 𝟐𝟎𝟐𝟓 ❤️🔥❤️🔥❤️🔥
The rise of #SuperYodha begins in theatres worldwide 🥷 ⚔️
Get ready to witness a breathtaking action adventure on the big screen ❤️🔥#MIRAIonAUGUST1st 🔥
SuperHero @tejasajja123
Rocking Star @HeroManoj1 @RitikaNayak_… pic.twitter.com/AXHpJKMjwE— People Media Factory (@peoplemediafcy) February 22, 2025
ఆ కారణంతోనే మళ్లీ వాయిదా
తాజాగా ఈ మూవీ నుంచి కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ఆగస్టు 1న థియేటర్లలో రిలీజ్(Release) చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తొలుత ఏప్రిల్ 18న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న మేర జరగకపోవడంతో జులై4న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కానీ ఆ సమయానికి కూడా సినిమా విడుదలకు సిద్ధం కాదని మరో తేదీని ప్రకటించారు. కాగా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ తాజా పోస్టర్(Poster) అభిమానుల్లో హైప్ పెంచేసింది.