
ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh)లో ఓవైపు భానుడు ప్రతాపం చూపిస్తుంటే.. మరోవైపు మిర్చి ఘాటు పొలిటికల్(Political)గా ఘాటెక్కిస్తోంది. మిర్చికి మద్దతు ధర(Price)పై అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ప్రసంగాలు చేస్తుండటంతో ఏపీలోని గుంటూరులో మిర్చి బోర్డు(Mirchi Board) ఏర్పాటు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు. గత సీజన్ వరకూ క్వింటా మిర్చి రేటు రూ.21000కు పైగా పలికింది. దీంతో అన్నదాతల మోముల్లో చిరునవ్వులు చిందాయి. అదే ఊపులో ఈసారి అంతకు రెట్టింపు సాగు చేపట్టారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. క్వింటా మిర్చి ధర ఏకంగా రూ.11వేల నుంచి రూ.13వేలకు పడిపోయింది. దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. తాజాగా ఇదే విషయంపై ఏపీ డిప్యూటీ స్వీకర్(AP Deputy Speaker) రఘురామకృష్ణరాజు స్పందించారు.
ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారానే శాశ్వత పరిష్కారం
APలో మిర్చి తగ్గడం రాజకీయ చర్చకు దారితీసింది. మొన్న YCP అధినేత గుంటూరు మిర్చి యార్డు(Mirchi Yard)కు వచ్చి అన్నదాతలకు మద్దతుగా మాట్లాడారు. ఆ తర్వాతి రోజే ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan)తో మిర్చికి మద్దతు ధరపై చర్చించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన సంబంధిత వర్గాలతో సమావేశం నిర్వహించాలని భావించారు. ఇదిలా ఉండగా.. డిమాండ్ తగ్గడంతో కొనుగోళ్లు, మద్దతు ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రత్యేక మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు(RRR) తెలిపారు.
సీఎం చంద్రబాబు చొరవ చూపాలి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. మిర్చి రైతుల సమస్యలు పరిష్కారించాలని అన్నారు. కేంద్రం తెలంగాణలో పసుపు బోర్డు మాదిరిగానే ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఈ విషయమై ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అయితే ఇటీవల మాజీ సీఎం జగన్‌కు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వెళ్లి ఎన్నికల కోడ్(Election Code)ను ఉల్లంఘించారని పేర్కొన్నారు.