కన్నడ నటి రన్యారావు (Ranya Rao Case) బంగారం స్మగ్లింగ్ కేసు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నటి బంగారంతో విమానాశ్రయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టినప్పుడు పోలీసు అధికారి పేరు చెప్పడంతో ఆమె వెనుక ఖాఖీల హస్తం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసు (Bengaluru Gold Smuggling Case)ను లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది ఆమె వెనక కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రన్యారావు పెళ్లి వీడియో పరిశీలన
అయితే రన్యారావు వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చినట్లు తెలుసుకున్న అధికారులు ఆమె పెళ్లి వీడియో చూశారు. అందులో ఆమెకు గెస్టులు అత్యంత ఖరీదైన గిఫ్టులు ఇచ్చినట్లు గుర్తించారు. వారికి ఆమెకు ఉన్న సంబంధాలపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రన్యారావు వివాహ వేడుకకు ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) కూడా హాజరైనట్లు తెలిసింది.
The Ranya Rao gold smuggling case in Karnataka has now reached the doorstep of Chief Minister Siddaramaiah. This dated photo also features the current Home Minister, G. Parmeshwara.
Ironically, the man dismissing any political links is none other than Congress’s CM-in-waiting,… pic.twitter.com/Wkn1n2Nnc3
— Amit Malviya (@amitmalviya) March 12, 2025
నటి పెళ్లిలో సీఎం సిద్ధూ
రన్యారావు వివాహ వేడుకలో సిద్ధరామయ్య (Siddaramaiah With Ranya Rao) పాల్గొన్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నూతన వధూవరులతో ఆయన కలిసి దిగిన ఫొటోను బీజేపీ నేత అమిత్ మాలవీయ (Amit Malaviya) ఎక్స్ వేదికగా షేర్ చేశారు. రన్యారావు స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన సమస్య ఇప్పుడు సీఎం ఇంటి వరకు వచ్చిందని మాలవీయ తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫొటోలో హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర కూడా ఉన్నారని.. ఈ కేసులో రాజకీయ సంబంధాలు లేవంటూ కొట్టి పారేసిన డీకే శివకుమార్ ఇప్పుడేమంటారు అని ప్రశ్నించారు.
స్మగ్లింగ్ లో సీఎం హస్తం?
రన్యారావు వివాహ వేడుకకు సీఎం సిద్ధరామయ్య హాజరైన ఫొటో బయటకు రావడంతో ఈ స్మగ్లింగ్‌లో ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎయిర్ పోర్టులో తనిఖీలు తప్పించుకునేందుకు ఆమెకు సాయం చేసిన అధికారికి.. సంబంధిత శాఖ అధికారుల నుంచి సూచనలు అందాయని న్యాయస్థానానికి డీఆర్ఐ (DRI On Gold Smuggling Case) విన్నవించింది. ఇంకా ఈ కేసులో డీఆర్ఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.






