
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఒక్క సినిమా అప్డేట్ కూడా మేకర్స్ వదలకపోవడంతో ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. ముఖ్యంగా డైరెక్టర్ మారుతి (Maruthi)తో ప్రభాస్ చేస్తున్న ‘ది రాజాసాబ్’ మూవీ విషయంలో డార్లింగ్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ఈ సినిమా ప్రకటించిన తర్వాత మేకర్స్ నాలుగైదు పోస్టర్లు, ఓ వీడియో గ్లింప్స్ వదిలారు. కానీ మళ్లీ ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఒక్క అప్డేట్ లేదు.
రాజాసాబ్ ఎప్పుడొస్తారు?
కల్కి (Kalki Movie) చిత్రం తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ మొదట మారుతితో ది రాజా సాబ్ (The Raja Saab) చేసేందుకు ఓకే చెప్పాడు. అన్నట్లుగానే షూటింగ్ కూడా మొదలైంది. కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయం కావడం ఆయన విశ్రాంతి తీసుకోవడం.. ఈ సమయంలోనే హను రాఘవపూడి (Hanu Raghavapudi)తో ఓ సినిమాకు ఓకే చెప్పడం ఈ చిత్రం పూజా కార్యక్రం జరగడం చకచకా జరిగిపోయాయి. ఇక రాజాసాబ్ మూవీ అలా వెనకపడిపోయింది.
రాజాసాబ్ లేటెస్ట్ అప్డేట్
మేకర్స్ రాజాసాబ్ మూవీని ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి ఆ తర్వాత వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకుండా సైలెంట్ గా ఉన్నారు. ఈ సినిమాలో నటించిన కమెడియన్ సప్తగిరి (Saptagiri) రాజాసాబ్ మూవీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఈ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ఆయన పెళ్లికాని ప్రసాద్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ప్రభాస్ ది రాజాసాబ్ మూవీ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.
Happy Sankranthi Darlings ❤️
Manam yeppudu vasthe appude Asalaina Panduga….Twaralo Chithakkottedham 🔥#TheRajaSaab will meet you soon in theatres. pic.twitter.com/pVAW0nyTjI
— The RajaSaab (@rajasaabmovie) January 14, 2025
ప్రభాస్ మూవీ టీజర్ రిలీజ్
రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ కామెండీ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనే రీతిలో ఉంటుందని సప్తగిరి ఈ చిత్రంపై మరింత హైప్ క్రియేట్ చేశారు. సప్తగిరి కామెంట్స్ తో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోయాయి. ప్రభాస్ తొలిసారిగా కామెడీ హార్రర్ జానర్లలో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇక ది రాజాసాబ్ చిత్రం టీజర్ (The Raja Saab Teaser) ను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అలాగే అప్పుడే ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్లు తెలిసింది.