Bhu Bharathi: ధరణి కాదు.. ఇకపై ‘భూ భారతి’

గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం భూ సమస్యల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన చట్టం ‘ధరణి(Dharani)’. దీని ద్వారా భూ దస్త్రాల ప్రక్షాళన, రైతు బంధు(Rythubandhu) వంటివి ఈ రికార్డుల మేరకే అమలు చేసింది. అయితే తాజా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మరో చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ‘భూ భారతి(Bhu Bharathi’ పేరిట కొత్త చట్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న RoR-2020ను రద్దు చేసి ఆ స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారు.

ఐదుగురు సభ్యులతో కమిటీ

పట్టా భూముల యజమానుల హక్కుల సంరక్షణతోపాటు ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్‌(Dharani Portal) పేరును కూడా భూభారతిగా మార్చారు. దీనిపై ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యలపై అధ్యయనానికి ఈ ఏడాది 2024, Jan 9న ఐదుగురు సభ్యులతో ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, మాజీ IAS రేమండ్‌ పీటర్, న్యాయనిపుణుడు భూమి సునీల్‌కుమార్, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ బి.మధుసూదన్‌లతోపాటు CCLAలతో ఏర్పాటు చేసిన కమిటీ పలు దఫాలు చర్చలు నిర్వహించింది.

జిల్లాల్లో పరిశీలించాకే నిర్ణయం

రైతులు(Formers), నిపుణులు, రెవెన్యూ సంఘాలు, వక్ఫ్, దేవాదాయ, అటవీశాఖల అధికారుల(Forest Officials)తో సమావేశమైంది. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించి సమస్యలను అధ్యయనం చేసింది. అనంతరం ప్రభుత్వానికి పలు సూచనలతో నివేదిక సమర్పించింది. కాగా అప్పటి BRS ప్రభుత్వం 2017-18 మధ్య భూ దస్త్రాల ప్రక్షాళన (LRUP) నిర్వహించింది. ఇక 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్‌ రైతులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో మొత్తం 33 రకాల సాఫ్ట్‌వేర్‌ మాడ్యూళ్లను అధికారులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *