
నాలుగేళ్ల క్రితం చాపకింద నీరులా వ్యాపించిన కరోనా మహమ్మారి(Corona Virus) ఎంతటి విలయాన్ని సృష్టించిందో అందరికీ తెలుసు. ఆ సూక్ష్మ వైరస్ నుంచి చాలా మంది ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వేల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయిన ఉదంతాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం(Central Govt) మరోసారి గుండెల్లో గుబులు పుట్టించే వార్త చెప్పింది. భారత్(India)లో మళ్లీ కరోనా కేసులు(Corona Virus Cases) పెరుగుతున్నట్లు వెల్లడించింది. అధికారక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 పాజిటివ్ రిపోర్ట్ వచ్చాయి.
ఆ దేశాల ప్రభావంతోనే భారత్‌లో కరోనా కేసులు
అయితే ప్రస్తుతం దేశంలో Covid-19 పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. హాంకాంగ్, సింగపూర్(Hong Kong, Singapore)లో పెరుగుతున్న కరోనా కేసులు భారత్‌పై ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. మహారాష్ట్ర(Maharastra)లో కరోనాతో ఇద్దరు చనిపోయారని, అయితే అవి కరోనా మరణాలు కాదని డాక్టర్లు తేల్చారు. చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చెప్పారు. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు(Active Cases) ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూశాయి. గతవారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదు.. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ.. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్న కేంద్రం.. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు#India
— తార-సితార (@Tsr1257) May 19, 2025