
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేసి అదరగొట్టేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ లైనప్‌లో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి ‘జైలర్ 2(Jailer2)’. మరొకటి ‘కూలీ(Cooli)’. మాస్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ‘కూలీ’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రజినీ సరసన పూజా హెగ్డే(Pooja Hegde) ఐటమ్ సాంగ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) మ్యూజిక్ అందిస్తున్నాడు.
Peak form unnapudu Nag ki celebrations Ela undevo.. ee movie tho dhaniki double triple range lo chupistham..
King @iamnagarjuna fans assemble on Aug 14th 🔥🔥#CoolieIn100Days pic.twitter.com/0fuKt4zbw4— King Balu (@rockstarbalu99) May 6, 2025
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు..
ఇందులో నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra), శ్రుతి హాసన్(Shruthi Hasan) సహా పలువురు కీలక నటీనటులు కనిపించనున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు.100 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని గుర్తుచేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియో(Special Video) షేర్ చేశారు. ఇప్పుడా వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. పాన్-ఇండియా లెవెల్‌లో బిగ్గెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న కూలీ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.