
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election Results) ఫలితాల కౌంటింగ్(Counting) ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్(Postal Ballot), EVMలలోని ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో BJP 35 స్థానాల్లో లీడ్ ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసిన కేజ్రీవాల్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వెనుకబడ్డారు. ఇక కాంగ్రెస్(Congress)కు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో నిరాశే ఎదురువుతోంది. ఆ పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రమే ముందంజలో ఉంది. మధ్యాహ్నం12 గంటల వరకు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది.
కాగా మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ మేజిక్ ఫిగర్(Magic figure) 36. స్ట్రాంగ్ రూమ్ చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎన్నికల. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ప్రతి కేంద్రంలో రెండు పారామిలిటరీ దళ బలగాలను మోహరించారు. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.