
ఏపీ(Andhra Pradesh)లో సంపద సృష్టించి ప్రజలకు పంచాలనే ఉద్దేశంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) మంత్రులు(Ministers), వివిధ శాఖల సెక్రటరీలకు సూచించారు. రేపటికి (ఫిబ్రవరి 12) కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇవాళ ఉదయం సచివాలయంలో మంత్రులు-వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం వ్యవస్థల్ని బాగు చేయడానికి తగినంత ప్రయత్నాలు చేస్తున్నామని CM చెప్పుకొచ్చారు. ఫైల్స్ సరి చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. ప్రతీ డిపార్టుమెంట్ టెక్నాలజీని(Technology) వినియోగించుకోవాలన్నారు. ఈ విషయంలో ఆఫీసర్లపై బాధ్యత ఉందన్నారు.
రేపటికి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. గడచిన ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారు. ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉంటుంది – ఒకట్రెండు కాదు.. ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏడు… pic.twitter.com/wbNqyHwdvv
— Polamreddy Dineshreddy (@PolamReddyOffl) February 11, 2025
YCP పాలనను ప్రజలు అంగీకరించలేదు
ఫైళ్ల క్లియరెన్సు(Clearance of files)పై కార్యదర్శులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతోందన్నారు. అంత సమయం తీసుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎందుకు ఫైళ్లు క్లియర్ చేయలేదో మీకు స్పష్టత ఉండాలన్నారు. కార్యదర్శులంతా సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కొంతమందిని ఎత్తి చూపడం కాదని, వ్యవస్థలు మెరుగుపడాలని సూచన చేశారు. ఐదేళ్ల YCP పరిపాలనను ప్రజలు అంగీకరించలేదన్నారు.
ఆరునెలల పాలనలో 12% పైగా వృద్ధి రేటు
మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు ఏదో ఒక సవాళ్లు ఉంటాయన్నారు. ఈసారి ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారన్నారు. 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు మనను అధికారం ఇచ్చారని గుర్తు చేశారు. గడిచిన ఆరునెలల పాలనలో 12% పైగా వృద్ధి రేటు కనిపించిందన్నారు. సర్వాంధ్ర-2047 ద్వారా లక్షాలను నిర్థేశించుకున్నా మన్నారు. 15శాతం వృద్ధి రేటుతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలన్నారు. కాగా అనారోగ్యం కారణంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సమావేశానికి హాజరుకాలేదు.
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న సమీక్షా సమావేశంలో సహచర మంత్రులతో మరియు వివిధ శాఖల కార్యదర్శులతో కలిసి పాల్గొన్న మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు..#ChandraBabuNaidu #AnaganiSatyaPrasad pic.twitter.com/O98pNFKX8I
— DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP (@RevenueAPGovt) February 11, 2025