
ఇడియా కూటమి(INDIA bloc)లో సఖ్యత లోపించినట్లు తెలుస్తోంది. BJPకి వ్యతిరేకంగా జట్టు కట్టిన పార్టీలలో అసంతృప్తి నెలకొంటోంది. ఇందుకు తాజా ఢిల్లీ ఫలితాలే నిదర్శనం. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Elections) ఇండియా కూటమి తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) బరిలోకి దిగకుండా.. ఒంటరిగానే పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆప్ 20కి పైగా విజయం సాధించగా.. కాంగ్రెస్(Congress) పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. దీంతో ఆ పార్టీపై మిగతా పార్టీలు గుర్రుగా ఉన్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ కరవైందని, వారితో ఉంటే తమకూ అదే గతి పడుతుందని భావిస్తున్నాయో ఏమో తెలియదు గానీ, ఇండియా కూటమిగా జట్టుకట్టిన పార్టీలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మమతా బెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలోనే TMC కూడా కూటమి నుంచి బయటికచ్చేసినట్లే కనిపిస్తోంది.
సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనేనా..
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, APPలు ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి BJPకు విజయాన్ని అందించాయి. అంతకుముందు హరియాణా ఎన్నికల్లో తమను కాదనడంతో ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కేజ్రీవాల్(Kejriwal) దూరం పెట్టారు. ఇద్దరి మధ్య సీట్ల సర్దుబాటు కుదరక ఒంటరిగా బరిలో దిగి ఓట్లు చీల్చుకున్నారు. అందుకే జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా ‘‘మీలో మీరు అలానే కొట్టుకోండి’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు అదే కూటమిలో మరో పెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్(TMC) కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో(West Bengal elections 2026) టీఎంసీ ఒంటరిగా బరిలో దిగుతుందని మమత చెప్పారు.
కీలక ప్రకటన చేసిన కాంగ్రెస్
ఢిల్లీ ఎన్నికల విషయంలో AAP, కాంగ్రెస్ మద్య వైరం కారణంగానే BJP గెలిచిందని చెప్పిన మమతా బెనర్జీ తన రాష్ట్రానికి వచ్చేసరికి అదే పంథా అవలంబించనున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగా(SOLO)నే బరిలో దిగుతామన్నారు. బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారంలో వస్తామన్నారు. దీంతో కూటమి పార్టీల ప్రకటనలు, విమర్శలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిపై కీలక ప్రకటన చేసింది. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని, అసెంబ్లీ ఎన్నికలకు కాదని స్పష్టం చేసింది.