
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన(Telangana Tour) రద్దు అయ్యింది. రాహుల్ గాంధీ షెడ్యూల్ ప్రకారం ఈ రోజు హనుమకొండ(Hanumakonda)లో పర్యటించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్(Delhi-Hyd)కు వచ్చి.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు ఆయన చేరుకుంటారని తొలుత పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 5.30 గంటలకు హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆయన భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి ట్రైన్‌లో తమిళనాడుకు వెళ్తారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. అందుకు అనుగుణంగా రాహుల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ చివరి నిమిషంలో రాహుల్ పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్(Congress) శ్రేణులు నిరాశకు గురయ్యారు.
అధికారిక ప్రకటన విడుదల చేసిన కాంగ్రెస్
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన రద్దుపై కాంగ్రెస్ వర్గాలు కొద్ది సేపటి క్రితం అధికారిక ప్రకటన(Official Announcement) విడుదల చేశాయి. ఈ రోజు పార్టీ పార్లమెంట్(Parliament)లో ముఖ్యమైన బిల్లుల చర్చ ఉందని తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొనడం కోసమే లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ HYD, వరంగల్ పర్యటన రద్దు అయినట్లు పేర్కొంది.
#WATCH | Delhi: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi arrives in the Parliament. pic.twitter.com/NGXROW9tSU
— ANI (@ANI) February 11, 2025
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…