టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోడుతున్నాడు. ఎంపీ (SP) ప్రియా సరోజ్ (Priya Saroj)తో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్ట బోతున్నాడు. అనే వార్త గత రెండ్రోజులుగా నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అయితే దీనిపై ప్రియా తండ్రి, యూపీలోని కెరకట్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తుఫానీ సరోజ్ క్లారిటీ ఇచ్చారు.
ప్రియ, రింకూల నిశ్చితార్థం జరగలేదు
ప్రియ, రింకూల నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న వార్తలను తుఫానీ సరోజ్ ఖండించారు. రింకూ ఫ్యామిలీ పెళ్లి ప్రతిపాదన తీసుకువచ్చారని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. జౌన్‌పూర్‌లోని మచ్చిలషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ప్రియా సరోజ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఆమెకు పార్లమెంట్.. ఆయనకు ఇంగ్లాండ్ సిరీస్
పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions 2025) జనవరి నెలాఖరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ పెళ్లి విషయంలో క్లారిటీ ఇస్తామని తుఫానీ సరోజ్ తెలిపారు. మరోవైపు రింకూ సింగ్ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ (IPL 2025) జరుగబోతుంది. రూ.13కోట్లకు రింకూ సింగ్‌ను కేకేఆర్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఓవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్, ఐపీఎల్ నేపథ్యంలో వీరి నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ఇద్దరికి కుదిరే రోజులు చూసి ఫిక్స్ చేయాల్సి ఉంటుందని తుఫానీ సరోజ్ తెలిపారు. ప్రియా సరోజ్ స్నేహితురాలి తండ్రి క్రికెటర్ అని.. ఆయన ద్వారా రింకూ, ప్రియ కలిశారని చెప్పారు. ఇరు కుటుంబాల మధ్య పెళ్లి విషయంలో చర్చలు జరిగాయని తుఫానీ సరోజ్ వివరించారు.







