మన ఈనాడు:రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నర్సింహులపల్లె గ్రామంలో తమ్ముడిని అతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపాడు అన్న తిరుపతి. భూ తగాదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పొలం పని చేస్తున్న రాకేష్ ను హత్యచేసి పరారయ్యాడు.
Karimnagar: ఈ మధ్య కాలంలో కుటుంబ సంబంధాలకు ఏ మాత్రం విలువ లేకుండా పోతోంది. ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా ఓడిగడుతున్నారు. తాజాగా, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అన్న తమ్ముడిని విచక్షణ రహితంగా హత్య చేశాడు. ఈ దారుణమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లె గ్రామంలో భూ తగాదాలతో ద్యాగ రాకేష్ అనే యువకుడిని అతి దారుణంగా నరికి హత్య చేశాడు అన్న ద్యాగ తిరుపతి.
అసలేం జరిగిందంటే..నర్సింహులపల్లె గ్రామంలో ద్యాగ రాకేష్ అనే యువకుడు ద్యాగ తిరుపతి అనే వ్యక్తి ఇద్దరు వరసకు అన్నదమ్ముళ్లు. అయితే, వీరిద్దరి మధ్య చాలా కాలం నుండి భూ తగదాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎప్పటిలాగే తమ్ముడు రాకేష్ పొలంకు వెళ్లాడు. అక్కడ తన పని తాను చేసుకుంటు ఉండగా అన్న తిరుపతి వచ్చాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అన్న తిరుపతి ఒక్కసారిగా తమ్ముడిపై దాడి చేశారు.
పొలం పని చేస్తున్న రాకేష్ ను గొడ్డలితో అతి క్రూరంగా నరికి చంపాడు అన్న తిరుపతి. దీంతో, అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. తమ్ముడిని నరికిన అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుండి పరార్ అయ్యాడు. అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి రాకేష్ ను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకని కేసుపై దర్యాప్తు చేపట్టారు.