IPLలో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్(DC vs PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జమ్మూలో పాకిస్థాన్ అనూహ్యంగా దాడులు(Pakistan’s unexpected attacks) చేయడంతో భారత హైకమిషన్ ఆదేశాల మేరకు మ్యాచును రద్దు(Cancel the match) చేశారు. తొలుత ఫ్లడ్ లైట్లలో సమస్య కారణంగా మ్యాచ్ నిలిపివేసినట్లు పేర్కొన్న ఐపీఎల్ యాజమాన్యం.. కాసేపటికే అత్యవసర పరిస్థితుల కారణంగా మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అంతకుముందు వర్షం ఆటంకం కల్పించడంతో లేటుగా ప్రారంభమైన ఈ మ్యాచులో టాస్ నెగ్గిన పంజాబ్ 10.1 ఓవర్లలో 122/1 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్ ఆగడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
PBKS VS DC match stopped due to significant technical failure 😭…#IndiaPakistanWar #IndianArmy #IndiaPakistanTensions #IndiaPakistan #PBKSvDC #dharamshala #IPL2025 #OperationSindhoor #OperationSindhoor2 #drone #droneattacks #Rajasthan #Pakistan #PakistanTerroristState pic.twitter.com/HxVJayscRe
— Pankaj Saini (@SainiPank92929) May 8, 2025
అదే జరిగితే మొత్తం ఐపీఎల్ రద్దు
కాగా ధర్మశాల స్టేడియం నుంచి తక్షణమే క్రికెటర్లు, అభిమానులు బయటకి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. కాగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్(Jammu Airstrip) ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పాక్ దాడిని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. భారత్ ప్రతి దాడుల్లో పాక్ భారీగా నష్టపోతోంది. ముఖ్యంగా భారత్ వైపు చొచ్చుకువచ్చిన రెండు జేఎఫ్17 రెండు యుద్ధ విమానాలను భారత బలగాలు కూల్చివేశాయి. కాగా పాకిస్థాన్-భారత్ మధ్య ఇదే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే మొత్తం ఐపీఎల్ రద్దయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
The #IPL match between Punjab Kings and Delhi Capitals in Dharamsala has been called off due to security reasons following air raid alerts and a blackout in the area.
— TOI Sports (@toisports) May 8, 2025








