IPL హిస్టరీలోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఈ సీజన్ కలిసిరావడం లేదు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC) చేతిలో 25 పరుగుల తేడాతో CSK ఓడిపోయింది. అది కూడా సొంతగడ్డపైనే కావడం విశేషం. 184 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో సీఎస్కే విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
నిరాశపర్చిన ధోనీ
విజయ్ శంకర్ (54 బంతుల్లో 69 పరుగులు) చేసి అజేయంగా నిలిచాడు. MS ధోనీ (26 బంతుల్లో 30 పరుగులు) చేసి నాటౌట్ నిలిచాడు. వీరిద్దరూ క్రీజులోనే ఉన్నప్పటికీ భారీ షాట్లు కొట్టలేక చెన్నై అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర 3, డెవాన్ కాన్వే 13, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి అవుటయ్యారు. శివమ్ దూబే (18), రవీంద్ర జడేజా (2) స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ 2, స్టార్క్, ముకేశ్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
రాహుల్ హాఫ్ సెంచరీ
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న DC నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 183 పరుగులు చేసింది. KL రాహుల్ 77, అభిషేక్ 33, అక్షర్ 21, రిజ్వీ 20, స్టబ్స్ 24 రన్స్ చేశారు. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా మూడో విజయం. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 4 మ్యాచులు ఆడిన CSK కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలిచింది.
Indian Premier League 2025
Chennai Super Kings vs Delhi Capitals, 17th MatchDC 183/6 (20)
CSK 158/5 (20)DC won by 25 runs#IndianSportsFans #CricketPredicta #IPL2025 #ViratKohli #IPLOnCricketPredicta #CSK #RCB #KKR #MSDhoni #PBKSvsRR #CSKvsDC #RohitSharma #RishabhPant pic.twitter.com/w1pKN9Nej8
— Indian Sports Fans. Fan Curated & Original (@IndianSportFan) April 5, 2025






