
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు(Sri Rama Navami Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ఈమేరకు ఆయా రామాలయాల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని(Sita Rama Kalyanam) పండితులు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయాలకు భారీగా భక్తులు(devotees) తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం(Bhadhrachalam) రామయ్య, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల్లో(Vontimitta Kodandarama Temple)నూ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో(Ayodhya Ramalayam)నూ రామ నవమి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.
భద్రాద్రిలో కన్నులపండువగా కళ్యాణ మహోత్సవం
శ్రీ రామ నవమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సకల జగతికి ఆనందకరమైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణం సందర్భంగా ఆ భద్రాద్రీశుడి ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపైనా ఉండాలని ప్రార్థించారు. ఇక భద్రాచలంలో ఈరోజు జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొంటున్నారు. ఆయన ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముందుగా ఆలయంలో భద్రాద్రి రామయ్యను దర్శించుకుంటారు. అనంతరం మిథిలా మండపంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 12.35 గంటలకు సీఎం బూర్గంపాడు మండలం సారపాకలో ఓ రేషన్ కార్డుదారుడి నివాసానికి వెళ్లి అక్కడ భోజనం చేసి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు.
ఒంటిమిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
ఏపీ వ్యాప్తంగా నేడు శ్రీరామ నవమి వేడుకలు (Sriramanavami) భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. చలువ పందిళ్లు వేసి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో ఒంటిమిట్ట (Vontimitta) కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 15 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11న సీతారాముల కళ్యాణోత్సవం జరుగుతుంది. సీఎం చంద్రబాబు(Cm Chnadrababu) పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు (Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
అయోధ్యలోని భవ్య రామాలయంలో..
అటు యూపీ అయోధ్య(Ayodhya)లోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తోంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి. చైత్ర శుక్ల నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు భగవంతుని జన్మదినోత్సవం నిర్వహిస్తారు. బలరాముడికి ఆరతి నిర్వహిస్తారు. దేవునికి 56 రకాల నైవేద్యాలు సమర్పిస్తారు.
Sri Rama Navami celebrations countrywide from Ayodhya to Tirupati!#SriRamanavami2025 #sarayu #ayodhyarammandir #suryatilak #Tirupati #ontimitta #Bhadrachalam pic.twitter.com/CjJo3DEgG8
— North East West South (@prawasitv) April 6, 2025