ManaEnadu : గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర. మరో రెండ్రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. దర్శకుడు శివ కొరటాల (Koratala Shiva) తెరకెక్కించిన దేవర-పార్ట్-1 సెప్టెంబర్ 27వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చంతా దేవర గురించే నడుస్తోంది. ‘సముద్రం ఎరుపెక్కాలా’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాను నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
రన్ ట్రైమ్ ట్రిమ్
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై పలు అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి దేవర (Devara Run Time) రన్ టైమ్ ట్రిమ్ గురించి. సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. అయితే ఈ చిత్ర నిడివిలో మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. దాదాపు ఎనిమిది నిమిషాలు ట్రిమ్ చేశారట. 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్ టైమ్తో ఈ సినిమా మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది.
దేవరలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్!
ఇక ఈ సినిమా గురించి మరో అప్డేట్ బాగా వైరల్ అవుతోంది. దేవర (NTR Devara)లో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ చేశారన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్లోనూ అది కనిపించింది. అయితే తారక్ ఇందులో ట్రిపుల్ రోల్ చేశారని కొత్త ప్రచారం షురూ అయింది. ఈ వార్తలపై దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో తారక్ చేసింది ట్రిపుల్ రోల్ కాదని ఆయన బల్లగుద్ది చెప్పేశారు.
తండ్రీకొడుకులా.. అన్నదమ్ములా?
ఈ మూవీపై సోషల్ మీడియాలో చాలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని, ఇందులో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశారని వస్తున్న వార్తలు నిజం కాదని రత్నవేలు (Rathnavelu) తెలిపారు. ఆయన డ్యూయెల్ రోల్ మాత్రమే చేస్తున్నారని స్పష్టం చేశారు. అయితే ఆ ద్విపాత్రాభినయం తండ్రీకొడుకుల పాత్రలో నటిస్తున్నారా, అన్నదమ్ముల్లా నటించారా అన్న విషయాన్ని మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలని చెప్పారు.