ManaEnadu : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ (Nara Rohit) రూటే సపరేటు. సినిమాల ఎంపికలో ఈయన స్టైల్ మిగతా హీరోలకంటే భిన్నంగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు నారా రోహిత్. ఈ సినిమా కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న సినిమా ప్రతినిధి (Prathinidhi). 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించడానికి పదేళ్లు పట్టింది. ‘ప్రతినిధి’కి సీక్వెల్‌గా పాత్రికేయుడు మూర్తి దేవప్తపు తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ ఏడాది మేలో థియేటర్లలో విడుదలైంది.
ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెర దించుతూ ప్రముఖ ఓటీటీ ఆహా ఓ ప్రకటన రిలీజ్ చేసింది. నారా రోహిత్ నటించిన ప్రతినిధి-3 సినిమా (Prathinidhi 2 OTT Release) ఈ నెల 27వ తేదీ నుంచి ‘Aha’లో స్ట్రీమింగ్ కానుంది. ‘ప్రశ్నించేందుకు ప్రతినిధి వస్తున్నాడు’ అంటూ సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
ప్రతినిధి స్టోరీ ఏంటంటే : నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చి ప్రశ్నించే జర్నలిస్ట్ (Journalist) చే అలియాస్ చేతన్ (నారా రోహిత్). ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేసే చేతన్‌ని ఎన్.ఎన్.సి ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమించిన తర్వాత ఆయన రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలని చాకచక్యంగా వెలుగులోకి తీసుకొస్తూ వారి జీవితాలను ప్రభావితం చేస్తుంటాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి (sachin khedekar)పై హత్యాయత్నం జరుగుతుంది. ఆ హత్య వెనుక ఉంది ఎవరు? సీబీఐ పరిశోధనలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? చేతన్ చేసిన పోరాటం ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.