గ్లాడియేటర్-II.. 24 ఏళ్ల తర్వాత సీక్వెల్.. లేటెస్ట్ ట్రైలర్ చూశారా?

Mana Enadu : గ్లాడియేటర్ (Gladiator).. 24 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద బ్లాక్​బస్టర్​ హిట్​తో సంచలనం సృష్టించింది. ఈ హాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ అప్పట్లో క్రియేట్ చేసిన హిస్టరీ అంతా ఇంతా కాదు. భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఎన్నో రికార్డులను బద్ధలు కొట్టింది. మరెన్నో రికార్డులు తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించిన గ్లాడియేటర్.. ఏకంగా 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకుంది.

రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాల్ మాస్కల్ (Paul Mescal) హీరోగా తన పర్ఫామెన్స్​తో అదరగొట్టాడు. పెడ్రో పాస్కల్, కొన్ని నీల్సన్, డెంజల్ వాషింగ్టన్, మేక్లామ్ వే కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు దాదాపు 24 ఏళ్ల తర్వాత సీక్వెల్​గా గ్లాడియేటర్ 2 (Gladiator II ) రాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్​ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి తెలుగు (Gladiator II Telugu), హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ట్రైలర్లు విడుదలయ్యాయి.

ఈ ట్రైలర్ (Gladiator II Telugu Trailer) చూస్తుంటే పార్ట్-1కు సంబంధం లేని స్టోరీని రెడీ చేసినట్లు కనిపిస్తోంది. పురాతన రోమ్ అందాలు, రోమన్ యుద్ధాలు, మైండ్ బ్లోయింగ్ విజువల్స్​తో గ్లాడియేటర్-2పై ఈ ట్రైలర్ సినిమా ప్రేక్షకులకు హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 22న తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళం లాంటి ఇతర ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు నవంబర్ 22వ తేదీన ఈ చిత్రం అమెరికా, కెనడాల్లో విడుదల కానుంది.

రోమన్ మాజీ చక్రవర్తి మార్కస్ ఆరేలియస్ (జోక్విన్ ఫీనిక్స్ పోషించిన) మనవడు లూసియస్ (మెస్కల్)తో ఎంట్రీతో షురూ అయింది. గ్లాడియేటర్​లో చిన్న పిల్లాడిగా కనిపించిన లూసియస్ (Lucius)… మార్కస్ (Marcus) చక్రవర్తిపై పార్ట్-2లో ప్రతీకారం తీర్చుకోనున్నట్లు ట్రైలర్​ చూస్తే అర్థమవుతుంది. ఇందులో లూసియస్ ఉత్తర ఆఫ్రికా ప్రాంతమైన నుమిడియాలో నివసిస్తున్నట్లు కనిపిస్తుంది. రోమన్ సామ్రాజ్యానికి దూరంగా ఉంచేందుకు అతడి తల్లి లూసియస్​ను అక్కడకు పంపిస్తుంది. కానీ పరిస్థితులు అతడిని తిరిగి రోమ్ కు తీసుకురావడంతో రోమ్​కు తిరిగొచ్చిన తర్వాత లూసియస్ పోరాటం ఎలా సాగింది? అతడి ప్రతీకారం నెరవేరిందా అనేదే గ్లాడియేర్-2 స్టోరీ అని తెలుస్తోంది.

Share post:

లేటెస్ట్