దేవర రిలీజ్ – తారక్ ఫ్యాన్స్ కు నిర్మాత రిక్వెస్ట్

Mana Enadu : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ (NTR) ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకక్కించిన సినిమా ‘దేవర’ (Devara). మరో రెండు రోజుల్లో సెప్టెంబరు 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ మొదలై హాటు కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. మరోవైపు దేవర ప్రమోషన్స్లో తారక్ బిజీబిజీగా ఉన్నారు. అయితే సినిమా విడుదల నేపథ్యంలో ‘దేవర’ డిస్ట్రిబ్యూటర్స్‌లో ఒకరైన నిర్మాత (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌) సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi) అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. అదేంటంటే?

ఫ్యాన్ వార్స్ వద్దు

‘‘చాలా గ్యాప్ తర్వాత తారక్ (Tarak Devara) అన్న నుంచి సినిమా వస్తోంది. మంచి ఎమోషనల్ కంటెంట్తో మాస్ యాక్షన్తో ప్రేక్షకులను అలరించేందుకు ఆయన త్వరలో మన ముందుకు వస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సాయంతో బెనిఫిట్ షోలు, ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో దేవర రిలీజ్ను మేం పకడ్బందీగా ప్లాన్ చేశాం. ఈ సమయంలో మా నుంచి మీకో చిన్న రిక్వెస్ట్. అభిమానులంతా ప్రశాంతంగా ఉండాలని మా విజ్ఞప్తి. సినిమా రిలీజ్ సమయంలో అనవసరమైన ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయకండి.

దేవర సెప్పిండు అంటే సేసినట్టే

ఫ్యాన్‌ వార్స్ (Tollywood Fan Wars) వల్ల మన సినిమాపై మనమే నెగటివిటీ పెంచుతున్నట్లవుతుంది. దీనివల్ల మన హీరోల సినిమాలపై ఎంతో ప్రభావం ఉంటుంది. దయచేసి అభిమానులంతా ఫ్యాన్‌ వార్స్‌కు గుడ్ బై చెప్పి సినిమాను ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను. దేవర సినిమా నుంచి అయినా సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌ వార్స్‌కు ముగింపు పలికేలా ప్రతిన పూనండి. ఫస్ట్‌ స్క్రీనింగ్‌లో సినిమా చూసే అభిమానులు నెట్టింట వీడియోలు షేర్ చేయకండి. తారక్‌ అన్నకు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్‌బస్టర్‌ అందిద్దాం. దేవర (Devara Release) సెప్పిండు అంటే సేసినట్టే’’ అని నాగవంశీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

దేవర టికెట్ ధరలు పెంపు

ఎన్టీఆర్‌ – కొరటాల శివ (Koratala Shiva) కాంబినేషన్‌లో వస్తోన్న దేవరలో బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్‌ నటిస్తోంది. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 27వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. అదనపు షోలు, టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Share post:

లేటెస్ట్