స్టార్ హీరో ధనుష్ (Dhanush) 54వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. పూజా హెగ్డే (Pooja Hegde), మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్లు. ‘పోర్ తొళిల్’ ఫేం విఘ్నేష్ రాజా దర్శకుడు. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై డాక్టర్ ఐసరి కె.గణేష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో ధనుష్ నటిస్తున్న దృశ్యాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ లో షేర్ చేసింది. ఒక పాత పీసీవో బూత్ నుంచి ధనుష్ ఫోన్ చేస్తున్నట్టుగా ఈ స్టిల్ ఉంది. ధనుష్ ఫేవరెట్, ఆయనకు అనేక హిట్ మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
త్వరలో మరిన్ని విషయాలు పంచుకుంటాం..
ఈ సందర్భంగా నిర్మాత గణేష్ పేర్కొంటూ ‘ధనుష్, విఘ్నేష్ రాజా, జీవీ ప్రకాష్ కుమార్ వంటి అసాధారణ ప్రతిభ కలిగిన వారితో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అర్థవంతమైన, వినోదాత్మకంగా ఉండే సినిమాలను మా బ్యానర్ పై నిర్మించి ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నిజంగానే ఈ సినిమా ఎంతో ప్రత్యేకమైంది. త్వరలోనే అభిమానులతో మరిన్ని విషయాలు పంచుకుంటాం’ అని పేర్కొన్నారు.
ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా కుబేర
ఇక ధనుష్ చివరి మూవీ ‘కుబేర’ (Kuberaa) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రూ.100కు పైగా కలెక్ట్ చేసి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మూవీలో నాగార్జున కీ రోల్ ప్లే చేయగా.. రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది.






