‘తండేల్’ నుంచి న్యూ అప్డేట్.. ‘దుల్లకొట్టేయాలా’ సాంగ్ స్టిల్స్ రిలీజ్

Mana Enadu : యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగచైతన్య, సాయిపల్లవి (Sal Pallavi) పాత్రలకు సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ అయి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమా నుంచి సరైన అప్డేట్ రావడం లేదని ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు.

తండేలో నుంచి శివరాత్రి సాంగ్

అయితే తాజాగా ‘తండేల్ (Thandel)’ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాట కోసం ఏకంగా వేయి మంది ఆర్టిస్టులు పని చేస్తున్నారట. ఇది శివరాత్రి స్పెషల్ సాంగ్ అంట. దుల్లకొట్టేయాలా అంటూ సాగే ఈ పాట నాగచైతన్య, సాయిపల్లవి మధ్య వస్తుందట. ఈ సాంగ్ ను దేవీశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కంపోజ్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సంబంధించి చై,సాయిపల్లవి స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

అర్ధనారీశ్వరుల గెటప్ లో చై, పల్లవి

ఈ స్టిల్స్ లో జాతర వైబ్ కనిపిస్తోంది. అర్ధనారీశ్వరుల రూపంలో బ్యాక్ గ్రౌండ్ లో శివపార్వతుల విగ్రహం ఉండగా.. దాని ముందు వందల మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఇక వారి ముందు నాగ చైతన్య, సాయిపల్లవి అర్ధనారీశ్వరుల రూపంలో పోజు ఇచ్చి నిల్చున్నట్లు ఈ స్టిల్ లో చూడొచ్చు. దక్షిణకాశీగా పేరు గాంచిన శ్రీకాకుళం (Srikakulam) లోని శ్రీముఖలింగం స్ఫూర్తితో ఈ సినిమా కోసం అద్భుతమైన శివరాత్రి సెట్ వేసి ఈ స్పెషల్ మహాశివరాత్రి పాటను రూపొందించారు. 

పాన్ ఇండియా భాషల్లో తండేల్

ఈ శివరాత్రి పాట (Shivratri Song) ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ లతో నాగ చైతన్య కెరీర్‌లో మోస్ట్ స్పెషల్ సాంగ్స్ లో ఒకటిగా ఉండబోతోంది. ఈ అద్భుతమైన పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి టీమ్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంగ్ షూట్ నుంచి మేకర్స్ విడుదల చేసిన రెండు పోస్టర్లలో నాగ చైతన్య, సాయి పల్లవి  డ్యాన్సర్లతో పాటు డ్యాన్స్ చేస్తూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తండేల్ మూవీ పాన్ ఇండియాలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Share post:

లేటెస్ట్