Mana Enadu : హైదరాబాద్ లో ట్రాఫిక్ (Hyderabad Traffic) లో చిక్కుకోకుండా.. సాఫీగా, సులువుగా గమ్యస్థానాలకు చేరువయ్యేందుకు ఎక్కువ మంది ప్రయాణికులు ఎంచుకునేది మెట్రో రైలు. అందుకే హైదరాబాద్ మెట్రో మొదలైన రోజు నుంచి నగర ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. తక్కువ సమయంలో సుదూరాలకు సులువుగా ప్రయాణించ గలుగుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు (TGSRTC Buses), ఆటోల మాదిరి కాకుండా మెట్రో ఛార్జీలు కాస్త అధికంగా ఉండటంతో మొదట నగర వాసులు కాస్త వెనుకంజ వేసినా.. సులభతర ప్రయాణం కోసం తర్వాత తర్వాత మెట్రోను ఆశ్రయించడం మొదలు పెట్టారు.
ఇక ప్రయాణికుల కోసం మెట్రో (Hyderabad Metro) కూడా అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటిస్తూ మరికొంత మందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ మెట్రో రైలు నగర ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికులకు అందిస్తున్న ఆఫర్ల (Hyderabad Metro Offers)ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు 2025 మార్చి 31వ తేదీ వరకు ఆఫర్లను పొడిగించినట్లు ప్రకటించింది.
ప్రస్తుతం అందిస్తున్న సూపర్ సేవర్-59, స్టూడెంట్ పాస్ (Metro Student Pass), సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా ప్రకటించింది. మరోవైపు అక్టోబర్ 6వ తేదీ నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు (Metro Parking Fee) వసూలు చేయనున్నట్లు తెలిపింది. ప్రయాణికుల సౌలభ్యం, భద్రత కోసమే ఈ రుసుము వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు.
Rashmika Mandanna: ‘ఛావా’ ప్రమోషన్స్.. రష్మిక కామెంట్స్‌పై కన్నడిగుల ఫైర్
ప్రజెంట్ సినీ ఇండస్ట్రీలో నేషన్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జోరు కొనసాగుతోంది. టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) అనే తేడా లేకుండా వరుసబెట్టి ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. దీంతో దక్షిణాది ఇండస్ట్రీలలో ఆమె పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఇటీవల యానిమల్(Animal), పుష్ప-2(Pushpa2)తో సూపర్…