టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఇవాళ.. ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు (Hyderabad IT Raids) చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వ్యాపారాలకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను ఆయన ఐటీ అధికారులకు అందించినట్లు తెలిసింది.
అందుకే ఐటీ సోదాలు
సంక్రాంతి పండగ సందర్భంగా దిల్ రాజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) వంటి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ నిర్మాణం, సినిమాల విడుదల తర్వాత లాభాలు.. ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడా వంటి వాటిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఇక దిల్ రాజుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, మ్యాంగో మీడియా సంస్థ, పలువురు దర్శక నిర్మాతల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి.







