Harish Shankar: రూటు మార్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్.. నటుడిగా రీఎంట్రీ!

టాలీవుడ్‌(Tollywood)లోని మాస్ క‌మ‌ర్షియ‌ల్ డైరక్టర్స్‌లో హరీశ్ శంకర్(Harish Shankar) ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే పవన్‌తో చేసిన ‘గ‌బ్బ‌ర్ సింగ్(Gabbar Singh)’తో తన సత్తా చూపించాడు. అయితే ఆ త‌ర‌వాత ఆ స్థాయి సక్సెస్ మళ్లీ అందుకోలేదు హరీశ్. రీసెంట్‌గా మాస్ మహారాజా రవితేజతో ‘మిస్ట‌ర్ బ‌చ్చ‌న్(Mr. Bachchan)’ చేశాడు. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఊహించిన రేంజ్‌లో బోల్తా కొట్టింది. అయితే బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేస్తాన‌ని చాలా కాలంగా చెబుతున్న ఆయన.. ఎట్ట‌కేల‌కు ఆ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించనున్నట్లు తెలుస్తోంది. KVN ప్రొడ‌క్ష‌న్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ గ్యాప్‌లో హరీశ్ శంకర్ నటుడు(As a Actor)గా మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంతకీ ఆ మూవీ ఏంంటంటే..

సుహాస్ హీరోగా రూపొందుతున్న సినిమాలో..

గతంలో హరీశ్ శంకర్ కొన్ని సినిమాల్లో చిన్న రోల్స్‌లో మాత్రమే కనిపించారు. రవితేజ నటించిన నిప్పు, నేనింతే వంటి చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశారు. కానీ తొలిసారి ఆయన ఓ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. సుహాస్(Suhas), మాళవికా మనోజ్ జంటగా రూపొందుతున్న సినిమాలో ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama Movie) ఒకటి. రామ్ గోధల(Ram Godhala) డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీని V-Arts పతాకంపై హరీశ్ నల్ల ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ గడగోని, ప్రదీప్ తల్లపురెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

హరీశ్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

ఈ సినిమాలో హరీశ్ శంకర్ ఒక కీలక పాత్ర(Key Role) చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ప్రారంభమైన షూటింగ్‌లో తాజాగా హరీశ్ శంకర్ జాయిన్ అయ్యారు. ఆయన మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ రామ్ గోధల. మరి హరీశ్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సినిమాలో ఆయన ఎంతసేపు కనిపిస్తారు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *