Divya Deshmukh: చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్.. ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ కైవసం

భారత స్టార్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh) చరిత్ర సృష్టించింది. ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్(FIDE Women’s Chess World Cup-2025) గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచింది. తెలుగు తేజం కోనేరు హంపి(Koneru Humpy)తో జరిగిన ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్ 2.5-1.5 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. మూడు రోజుల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌ ఫలితాన్ని టై బ్రేకర్(Tie-Breaker) ద్వారా తేల్చారు. తొలి రెండు గేమ్స్ డ్రా కావడంతో సోమవారం టై బ్రేకర్ మ్యాచ్‌లు నిర్వహించారు. టై-బ్రేకర్స్‌లో 10 నిమిషాల వ్యవధితో కూడిన రెండు ర్యాపిడ్ గేమ్స్(Rapid Games) నిర్వహించారు. ఈ ర్యాపిడ్ గేమ్ ప్రతీ ఎత్తుకు 10 సెకన్ల ఇంక్రిమెంట్ సమయం మాత్రమే ఉంటుంది. ట్రై బ్రేకర్‌లో మొదటి ర్యాపిడ్ గేమ్ కూడా డ్రాగా ముగిసింది. ఈ గేమ్‌లో కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్ హోరీహోరీగా తలపడ్డారు. ఈ గేమ్ కూడా ఆఖరి ఎత్తు వరకు ఉత్కంఠగా సాగింది. ఈ గేమ్‌లో ఇరువురు డ్రాకు అంగీకరించారు.

Image

రెండో గేమ్‌లో ఓటమిని అంగీకరించిన హంపి

రెండో ర్యాపిడ్ గేమ్‌లో దివ్య దేశ్‌ముఖ్ నల్లపావులతో ఆడి, అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ గేమ్‌లో కోనేరు హంపి ఒక కీలకమైన ఎండ్-గేమ్ పొరపాటు చేసింది. ఈ తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కోనేరు హంపి ఓటమిని అంగీకరించి గేమ్ నుంచి వైదొలిగింది. హంపి చేసిన తప్పిదాలు దివ్య దేశ్‌ముఖ్‌కు కలిసొచ్చాయి.

Image

ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌‌కు అర్హత

ఈ చారిత్రక విజయంతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కి చెందిన 19 ఏళ్ల దివ్య దేశ్‌ముఖ్ గ్రాండ్‌మాస్టర్ హోదా(Grandmaster status)ను అందుకుంది. భారత మహిళా చెస్ చరిత్రలో ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. ప్రపంచకప్‌ను గెలుచుకోవడం ద్వారా దివ్య దేశ్‌ముఖ్ 2026లో జరిగే ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్ టోర్నమెంట్‌(Candidate’s Tournament)కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. ఇద్దరు భారత చెస్ ప్లేయర్స్ ఫైనల్‌కు చేరుకోవడం, అందులో దివ్య విజయం సాధించడం భారత చెస్ చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. ఈ ఘనతతో భారత చెస్‌లో నూతన శకాన్ని ఆవిష్కరించిన దివ్య, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ విజయం తన కెరీర్‌లో కేవలం ఆరంభమని, ఇంకా ఎన్నో సాధించాలని దివ్య పేర్కొంది. కాగా దివ్యను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రశంసలతో ముంచెత్తారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *