Brahmanandam: కామెడీ కింగ్ బ్రహ్మానందానికి ఎన్నికోట్ల ఆస్తి ఉందో తెలుసా? చూస్తే నోరెళ్లబెడుతారు!

తెలుగు సినీ రంగంలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నా, కామెడీ కింగ్ బ్రహ్మానందం(Comedy King Brahmanandam) స్థాయికి ఎవరూ భర్తీ చేయలేరు.. తెరపై ఆయన కనిపిస్తే చాలు, థియేటర్లలో నవ్వుల పండగ మొదలవుతుంది. ఆయన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అన్నీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవే. ఆయన హావభావాలతోనే నవ్వించగల విలక్షణ నటుడు.

గిన్నిస్ రికార్డు.. 1000కు పైగా సినిమాలు!

1986లో చంటబ్బాయి సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్రహ్మానందం.. ఇప్పటి వరకు 1050కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచాయి.ఈ క్రమంలో అత్యధిక సినిమాల్లో నటించిన కమెడియన్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది.

ఇప్పటికీ సినిమాల్లో బిజీగా .. 68 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం!

ప్రస్తుతం బ్రహ్మానందం (Brahmanandam) 68 సంవత్సరాలు వయసున్నప్పటికీ, సినిమాల్లో నటిస్తున్నారు. కొన్ని సినిమాల్లో ముఖ్యమైన కామెడీ రోల్స్ చేస్తూ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక్క సినిమాకి దాదాపు రూ. 2.5 కోట్లు వరకు పారితోషికం(Remuneration) తీసుకుంటున్నారని సమాచారం. అత్యధిక పారితోషికం అందుకుంటున్న కమెడియన్‌గా రాణిస్తున్నాడు.

కోట్లు సంపాదించిన కమెడియన్‌.. సింపుల్ లైఫ్‌స్టైల్

కేవలం కామెడీ పాత్రలతోనే బ్రహ్మానందం అనేక కోట్లు సంపాదించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆయన 495 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో ఆయ‌న‌కి విలువైన ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినా కూడా ఆయన చాలా సాదాసీదా లైఫ్‌స్టైల్‌ను ఫాలో అవుతూ, ఇప్పటికీ తన పని తాను చేసుకోవడం ఇష్టం అంటున్న బ్రహ్మానందం.

కామెడీతో పాటు కళాప్రతిభ – చిత్రలేఖనంలో ఆసక్తి

నటుడిగా మాత్రమే కాదు, చిత్రలేఖనంలోనూ ఆయన ప్రతిభ కనబడుతుంది. ఫ్రీ టైమ్‌లో పెయింటింగ్స్ వేయడం ఆయనకు ఎంతో ఇష్టం. నటన ప్రపంచానికి బ్రహ్మానందం ఒక చిరునామా అయితే, వ్యక్తిత్వంగా ఆయన వినయానికి మరో పేరు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన స్థానం శాశ్వతంగా నిలిచిపోతుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *