
నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇటీవల ‘డాకు మహారాజ్(Daaku Mahaaraj)’తో సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగానూ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఇక ఇదే ఊపులో బాలయ్య అఖండ-2(Akhanda-2) మూవీని చేస్తున్నారు. సింహ, లెజెండ్, అఖండ తర్వాత బోయపాటి శ్రీను-బాలయ్య(Boyapati Srinu-Balayya) కాంబోలో రాబోతున్న నాలుగో చిత్రం అఖండ-2. బాలకృష్ణ ఉగ్రరూపం చూపించిన అఖండ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే ఒరవడిని కొనసాగిస్తూ అఖండ2 చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణను రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జెట్ స్పీడుతో కొనసాగుతోంది.
మహాశివరాత్రి కానుకగా ఫస్ట్ లుక్
మరోసారి బాక్సాఫీస్ తాండవం చేయడానికి రెడీ అవుతుంది అఖండ-2. ఇండస్ట్రీ షేక్ అయ్యే సినిమా రావాలంటే బోయపాటి శ్రీను-బాలకృష్ణ కలవాల్సిందే అన్నట్టుగా ట్రెండ్ క్రియేట్ చేసుకుంది ఈ కాంబో. అఘోరా(Aghora) పాత్రలో అయితే బాలయ్య బాబు విశ్వరూపం చూడనున్నామట. తాజాగా ఈ రోల్‌కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) మహా శివరాత్రి(Maha Sivaratri) కానుకగా రిలీజ్ చేస్తారని సినీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా బాలయ్యకు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది.
ఏకంగా రూ.7 కోట్ల మేర పెంచిన బాలయ్య?
అఖండ 2 కోసం బాలకృష్ణ తన రెమ్యునరేషన్(Remuneration) ఎంతనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీకి ఆయన రెమ్యునరేషన్ మరింత పెంచేశారని సమాచారం. గతంలో ఆయన రూ.28 కోట్లు తీసుకునేవారని టాక్. అయితే దీనిపై ఏకంగా రూ.7 కోట్ల మేర పెంచి ఈ సినిమాలో నటించినందుకు గాను రూ.35 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీకి తమన్(Thaman) మ్యూజిక్ అందిస్తుండగా.. సంయుక్తా మేనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 14 ప్లస్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీనాథ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.