
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం(Sri Lakshminarasimhaswamy Temple) కొత్త హంగులతో అత్యంత శోభాయమానంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయంలో మహా కుంభాభిషేక సంరక్షణ మహోత్సవాలు(Maha Kumbhabhisheka Preservation Mahostavalu) అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అలాగే మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కాగా చాలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి(Devastana Swarna Vimana Gopuram) ఇవాళ (ఫిబ్రవరి 23) మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరుకానున్నారు.
సీఎం రేవంత్ షెడ్యూల్ ఇలా..
ఈమేరకు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర ప్రారంభ కార్యక్రమానికి సంబంధించి సీఎం రేవంత్ పర్యటన షెడ్యూల్(CM Schedule) ఫిక్స్ అయింది. ఉదయం 11 గంటలకు సీఎం హెలికాప్టర్‌లో యాదగిరి గుట్టకు వస్తారు. 11.54కి మూలా నక్షత్రం, వృషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేస్తారు. ఈ మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో సీఎంతోపాటూ MPలు, మంత్రులు, MLAలు, పండితులు పాల్గొంటారు. ఈ సందర్భంగా.. కొండపై 25 వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. ఇక ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం KCRను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది.
దేశంలోనే అత్యంత ఎత్తయిన గోపురం
కాగా దేశంలోనే అత్యంత ఎత్తయిన గోపురం ఇదే కావడం విశేషం. 2024లో స్వర్ణ తాపడం(Gold Panning) పనులను ప్రారంభించగా.. ఈనెల 18న తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి. అయితే ఈ బిగింపు పనులకు ఆయన మొత్తం ఖర్చు రూ.5.10 కోట్లు. ఇక రాగి రేకులకు మొత్తం రూ.12 లక్షలు ఖర్చు కాగా, సుమారు ఈ స్వర్ణ తాపడం పనులకు రూ.70 కోట్ల వరకు ఖర్చయినట్టుగా అంచనా. అయితే ఈ స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తైన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరి ఎక్కడా లేదు. దీనికి దాదాపు 68 కిలోల బంగారం(Gold) వినియోగించినట్లు సమాచారం. కాగా విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు కాగా గోపురం వైశాల్యం 10759 చదరపు అడుగులు.