Bigg Boss 8 : డబుల్‌ ఎలిమినేషన్‌.. ట్విస్టులు, టర్నులతో మరింత ఎంటర్టైన్మెంట్

Mana Enadu : బిగ్‌బాస్‌ సీజన్‌-8 సందడిగా కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ (Bigg Boss 8 Telugu Double Elimination) జరిగింది. శనివారం టేస్టీ తేజ (Tasty Tteja Bigg Boss) ఎలిమినేట్‌.. ఆదివారం పృథ్వీ ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ వారం అవినాష్‌, గౌతమ్‌, పృథ్వీ, టేస్టీ తేజ, నబీల్‌, నిఖిల్‌, విష్ణు ప్రియ, ప్రేరణ మొత్తం 8మంది నామినేషన్స్‌లో ఉన్నారు.

సూపర్ హిట్.. ఫ్లాప్ ఎవరు?

వీరిలో అవినాష్‌ (Avinash bigg boss 8) గ్రాండ్‌ ఫినాలే టికెట్‌ గెలుచుకుని నేరుగా ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి కంటెస్టెంట్‌ అయ్యాడు. ఇక ఈ వారం ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో శనివారం రోజున టేస్టీ తేజ.. ఆదివారం రోజున పృథ్వీ ఎలిమినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ హోస్టు నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన పృథ్వీ (Prudhvi bigg boss 8)ని.. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న వారిలో ముగ్గురు సూపర్‌ హిట్‌లు, సూపర్‌ ఫ్లాప్‌లో ఎవరో చెప్పమని నాగార్జున అడిగారు.

నా ఓటు వారికే

నిఖిల్‌, నబీల్‌, విష్ణు ప్రియలు సూపర్‌ హిట్‌ అని..  రోహిణి, అవినాష్‌ సూపర్‌ ఫ్లాప్‌ల జాబితాలో వాళ్లిద్దరి పేర్లు చెప్పాడు పృథ్వీ. అయితే నబీల్‌, ప్రేరణ, నిఖిల్‌, విష్ణు ప్రియలకు తాను ఓటు వేస్తానని తెలిపాడు. మరోవైపు తనని పదిసార్లు నామినేషన్స్‌ నుంచి బయట పడేసి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. 

ప్రైజ్‌మనీతో పాటు మరో సర్‌ప్రైజ్‌

అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. సీజన్‌-8 విన్నర్‌ (bigg boss 8 telugu winner) ట్రోఫీ, ప్రైజ్‌ మనీతో (bigg boss 8 telugu winner prize money) పాటు మారుతీ సుజుకీ ఆల్‌ న్యూ డ్యాజిలింగ్‌ డిజైర్‌ కారు కూడా సొంతం చేసుకుంటారని తెలిపారు. అలాగే షోలో.. ఇప్పటి నుంచి ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లు ఉంటాయని వెల్లడించారు.

మరో స్పెషల్ ఆఫర్ 

గోల్డెన్‌ టికెట్‌ వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్‌లకు స్పెషల్‌ ఆఫర్‌ ఉంటుందని ప్రకటించారు. ఇంకోవైపు డిసెంబరు 2వ తేదీ నుంచి బిగ్‌బాస్‌ సీజన్‌-8 (Bigg Boss Telugu) రాత్రి 10 గంటల నుంచి ప్రసారమవుతుందని చెప్పారు. ఇక చివరలో అవినాష్‌ మినహా మిగిలిన ఇంటి సభ్యులందరూ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నేరుగా నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించాడు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *