ప్రస్తుత టెక్ యుగంలో గుండెపోటు(Heart Attack) అనేది వృద్ధులకే కాదు.. మారుతున్న ఆహారపు అలవాట్లు(Eating habits), వ్యాయామం(Exercise) చేయకపోవడం, పని ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనూ గుండె సమస్యలు(Heart Problems) వస్తున్నాయి. చాలా మంది వ్యాధి వచ్చేలోపు గుర్తించలేక చివరికి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, గుండెపోటు రాకముందు, శరీరం దాదాపు నెల రోజుల ముందు నుండే కొన్ని సంకేతాల(Some signs)ను చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలను గుర్తించి, సకాలంలో వైద్య సహాయం(Medical assistance) తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటి సంకేతం అసాధారణ అలసట. రోజువారీ పనులు చేస్తున్నప్పుడు అతిగా అలసిపోవడం, శక్తి లేనట్టు అనిపించడం గుండె సమస్యల సూచన కావచ్చు.

ఈ సమస్యలు కనిపిస్తే వైద్య సాయం అవసరం
రెండవది, శ్వాస తీసుకోవడంలో(Difficulty breathing) ఇబ్బంది. సాధారణ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం లేదా ఊపిరి తీసుకోవడంలో ఆటంకం గుండెకు రక్త సరఫరా(Blood supply to the heart)లో సమస్యను సూచిస్తుంది. ఛాతీలో అసౌకర్యం మరొక ముఖ్యమైన లక్షణం. అలాగే ఛాతీలో ఒత్తిడి, నొప్పి లేదా బరువు అనిపించడం, ఇది తరచూ జీర్ణ సమస్యగా భావించి పట్టించుకోకుండా వదిలేస్తారు. అసాధారణ చెమటలు(Sweating) కూడా ఒక సంకేతం. కారణం లేకుండా చల్లని చెమటలు పట్టడం గుండె సమస్యల సూచన కావచ్చు.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి..
ఇతర లక్షణాల్లో చేతులు, భుజాలు, మెడ లేదా దవడలో నొప్పి, మైకము లేదా తలతిరగడం(Dizziness), జీర్ణ సమస్యలూ ఉన్నాయి. మహిళల్లో, ఈ లక్షణాలు తేలికగా ఉండవచ్చు, కానీ విస్మరించకూడదు. ఈ సంకేతాలు గమనించిన వెంటనే వైద్యుడి(Doctor)ని సంప్రదించడం అవసరం. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ చాలా ముఖ్యం. మీ ఆరోగ్యాన్ని పట్టించుకోండి, సంకేతాలను విస్మరించొద్దని వైద్యులు చెబుతున్నారు.








