ఖాళీ గాజు బాటిల్స్‌తో లక్షల్లో ఆదాయం.. కేవలం ఒక లక్షతో కొత్త బిజినెస్ ఐడియా!

ఇప్పటి తరం యువత అభిప్రాయాలు, అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు “ముందు ఉద్యోగం – తర్వాత వ్యాపారం” అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు చదువు పూర్తికాగానే వ్యాపారం మొదలుపెట్టాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి యువత కోసం ఇది చక్కటి బిజినెస్ ఐడియా(Business Idea).. గ్లాస్ బాటిల్(గాజు బాటిల్స్‌) రీసైక్లింగ్ వ్యాపారం!.

ప్రస్తుతం భారతదేశంలో రోజుకు సగటున కోటిన్నర గ్లాస్ బాటిల్స్ వేస్టేజ్ అవుతున్నాయి. ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్ వంటి వాటి వల్ల ఎన్నో ఖాళీ బాటిల్స్ వృథాగా పడి ఉంటాయి. అయితే ఈ వేస్టేజ్‌ను సరిగ్గా వినియోగించుకుంటే మంచి ఆదాయ వనరుగా మలచుకోవచ్చు.

ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా అవసరమయ్యే ప్రధాన యంత్రం.. గ్లాస్ బాటిల్ పౌడరింగ్ మిషన్. ఇది మార్కెట్లో రూ. 50,000 నుండి రూ. 2 లక్షల వరకు లభిస్తుంది. స్టార్టప్ స్థాయిలో ఉంటే రూ. 75,000 నుంచి 1 లక్ష రూపాయల ఖర్చుతో సరిపోతుంది.

బాటిల్స్‌ను సేకరించేందుకు స్క్రాప్ డీలర్లు, బార్లు, వైన్ షాపులతో ఒప్పందాలు చేసుకోవచ్చు. రోజుకు కనీసం 300–400 బాటిల్స్ సేకరించగలిగితే స్థిరమైన ఉత్పత్తి సాధ్యం. శుభ్రం చేసిన గ్లాస్ బాటిల్స్‌ను యంత్రంలో వేసిన తరువాత అవి చిన్న గాజు ముక్కలుగా, అంటే గ్లాస్ క్రిస్టల్స్గా మారతాయి.

ఈ గ్లాస్ క్రిస్టల్స్‌ను నిర్మాణ రంగం, గాజు తయారీ సంస్థలు, డెకరేటివ్ వస్తువుల తయారీ కంపెనీలు ముడి పదార్థంగా విస్తృతంగా వినియోగిస్తాయి. టన్ను గ్లాస్ క్రిస్టల్స్ తయారీకి సగటున రూ. 3,000 ఖర్చు కాగా, మార్కెట్లో అదే టన్ను రూ. 8,000 వరకు అమ్మవచ్చు. అంటే టన్నుకు రూ. 5,000 నికర లాభం. నెలకు కనీసం 20 టన్నులు అమ్మగలిగితే, దాదాపు రూ. లక్ష లాభం సంపాదించవచ్చు.

ఇది మాత్రమే కాదు.. గాజు పునర్వినియోగానికి అనుకూలమైన పదార్థం కావడంతో, దీన్ని ఉపయోగించే పరిశ్రమలు వేగంగా పెరుగుతున్నాయి. ఫర్నిచర్ డిజైన్ కంపెనీలు, కాంక్రీట్ మిశ్రమ సంస్థలు, బిల్డింగ్ మెటీరియల్స్ డీలర్లు ఈ క్రిస్టల్స్‌కు స్థిరమైన డిమాండ్ చూపిస్తున్నారు. అందుకే తక్కువ పెట్టుబడితో ప్రారంభించి, స్థిర ఆదాయం కలిగించే ఈ వ్యాపారం యువతకు నిజమైన గేమ్‌చేంజర్ కావొచ్చు!

Related Posts

Gold & Silver Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు (Gold Rate) భారీగా పెరిగాయి. అంతర్జాతీయ, జియోపాలిటికల్ పరిణామాల నేపథ్యంలో ఈ పెరుగుదల నమోదైంది. ఇండియా-అమెరికా మధ్య టారిఫ్‌ల ప్రభావం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, డాలర్‌(Dollar) క్షీణత వంటి కారణాలతో అంతర్జాతీయంగా పసిడి, వెండి ధరల (Gold…

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. కేజీ వెండి రేటెంతంటే?

బంగారం ధరలు(Gold Rates) రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో ఈ రోజు (ఆగస్టు 29) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.1,03,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *