ఈరోజుల్లో కారు అనేది అవసరంగా మారిపోయింది. కారు కొనాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే కారు కొనాలంటే రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది ప్రతి ఒక్కరి సాధ్యపడదు, ముఖ్యంగా మిడిల్ క్లాస్ కుటుంబాలకు అస్సలు కుదరదు. అందుకే చాలా మంది కారును కొనాలన్న కోరికను పక్కన పెట్టేస్తుంటారు. కానీ, ఆ కోరికను తక్కువ బడ్జెట్‌తోనే తీరుస్తూ, హాయిగా కారులో తిరిగే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది.
తక్కువ ఖర్చుతో కారు కొనాలనే కలను నెరవేర్చుకోవాలంటే సెకండ్ హ్యాండ్ కార్లు ఉత్తమ పరిష్కారం. కొత్త కారుతో పోలిస్తే వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక కొత్త కారుకు కనీసం రూ. 5 లక్షలు అవసరమైతే, అదే కారును సెకండ్ హ్యాండ్‌గా రూ. 2 లక్షలకే( 2 Lakh) కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా మారుతి వ్యాగన్ఆర్(Maruthi wagon r Car) లాంటి కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి, ఇవి మంచి మైలేజ్, నమ్మదగిన ఇంజిన్ పనితీరు, సదుపాయాలు కలిగి ఉంటాయి.
ఇలాంటి కార్లను Spinny, CarDekho, Maruti Suzuki True Value వంటి సంస్థలు విక్రయిస్తున్నాయి. ఇవి నకిలీ కార్ల కాదు, తనిఖీ చేసిన, ఆధారాలున్న కార్లను మాత్రమే అందుబాటులో పెడతాయి. అంతేకాకుండా కొన్ని సంస్థలు ఈ కార్లపై లోన్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నాయి.
అయితే, సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:
కారును నిపుణులైన మెకానిక్ తో చెక్ చేయించాలి. గతంలో ఏవైనా ప్రమాదలు జరిగాయా అని తెలుసుకోవాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, బ్యాంకు లోన్ బకాయిలు ఉన్నాయ లేదా అనేది తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ కడుతున్న కాలాన్ని తెలుసుకోవాలి.
ఇలాంటి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలి. అలాగే సాధారణ డీలర్ల కన్నా బ్రాండెడ్ షోరూమ్‌లను సంప్రదించడం మేలు. వారు వాహనాన్ని పూర్తి తనిఖీ చేసి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లతో కలిపి ఇస్తారు.
అంతేగాక, కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్లీ అదే కారును సెకండ్ హ్యాండ్‌గా అమ్మేసి కొత్త కారుకు మారే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలని చూస్తున్నవారికి ఇది ఒక వినూత్న, సురక్షిత మార్గం కూడా.







