మన ఈనాడు:
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో (Ts Election) ఎన్నికల సంఘం ప్రతీ అంశంపై ప్రత్యేక దృష్టిసారించింది. ముఖ్యంగా నగదు బదిలీలపై దృష్టి పెట్టింది. పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయల డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్స్‌పై ఫోకస్ పెట్టింది. గూగుల్ పే(GOOGLE PAY), ఫోన్ పే(PHONE PAY)లో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై ఈసీ (EC)సీరియస్ యాక్షన్‌కు పూనుకుంది.
ఇందులో భాగంగానే పర్సనల్ఖాతాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఖాతాలపై ఈసీ కన్నేసింది. ఇందులో భాగంగా ఆయా బ్యాంకులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది. రోజువారీగా అనుమానిత, ఎక్కువ మొత్తంలో నగదు చెలామణి అవుతున్న ఖాతా లిస్ట్‌ను ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల ఎన్నికల అధికారితో పాటు సీఈవోకు కూడా లిస్ట్ పంపాలని సూచించింది. ఒకే ఖాతా నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయ్యే ఖాతాలపై ప్రధానంగా ఓ కన్నేసి పెట్టింది.