మన ఈనాడు, బిజినెస్ డెస్క్:
రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు గడువు పొడిగిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటిస్తూ శనివారం ప్రకటించింది.నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి గడువును పొడిగించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణి నుంచి వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. నోట్ల డిపాజిట్, మార్పిడికి సెప్టెంబర్ 30 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్‌బీఐ మరోసారి గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 7 వరకు ప్రజలు నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది.
ఉపసంహరణపై సమీక్ష జరిపిన ఆర్‌బీఐ మరోసారి నోట్లను మార్పుకునేందుకు గడువును పొడిగించాలని నిర్ణయించినట్లు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.2వేలనోట్లు చట్టబద్ధంగా చెల్లుబాటవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎవరివద్దనైనా నోట్లు ఉంటే బ్యాంకుల్లో, పోస్టాఫీస్‌లలో మార్చుకోవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మే 16న ఆర్‌బీఐ రూ.2వేలనోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అదే నెల 19 నుంచి నోట్లను మార్చుకునేందుకు అవకాశం ఇచ్చింది.
ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం రూ.2000 డినామినేషన్‌లో ఉన్న మొత్తం నోట్లలో 87 శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, దాదాపు 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్చుకున్నట్లు వివరించింది. ఇంకా ఎవరవద్దనైనా రూ.2000 నోట్లు ఉంటే సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి రూ.2000 నోట్లను మార్చుకోవచ్చని ఆర్‌బీఐ వివరించింది.