ఆ 8 మంది MLCల పదవీకాలం పూర్తి.. నేడు మండలిలో సన్మానం

తెలంగాణ(Telangana)లో పలువురు (MLC)ల పదవీకాలం నేటితో ముగియనుంది. ఈ మేరకు BRS ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాశ్‌రెడ్డి, ఎగ్గే మల్లేశంతోపాటు కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఉన్నారు. వీరితోపాటు MIM సభ్యుడు మీర్జారియాజ్‌ ఉల్‌హసన్‌ అఫెండీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(Teacher MLC)లు నర్సిరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి ఉన్నారు. వీరికి గురువారం మండలిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

జీవన్ రెడ్డి అసంతృప్తి.. కానీ!

ఇదిలా ఉండగా మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పదవి రాకపోవడంపై ఇటీవల జీవన్ రెడ్డి(Jeevan Reddy) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా పదవి రాకపోతే అసంతృప్తి ఉండడం సహజమేనని, అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులతో సంబంధం లేకుండా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. కాగా కాంగ్రెస్ ఇటీవల్ విజయశాంతి(Vijayashanti), అద్దంకి దయాకర్‌(Addanki Dayakar)ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Vaartha:Telugu News|Latest Telugu News|Breaking News Telugu

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *