Polling Center: గూగుల్ మ్యాప్లో మీ పోలింగ్ కేంద్రాన్ని చూడండిలా..

మన ఈనాడు:

గూగుల్ రోజుకో సరికొత్త ఫీచర్ తో దినదినాభివృద్ది చెందుతోంది. మన్నటి వరకూ ఫోటో ద్వారా గూగుల్ మ్యాప్ యాక్టివ్ అయ్యే స్థాయి నుంచి నేడు ఎన్నికల పోలింగ్ బూత్ లను చూపించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకు గూగుల్ సేవలను ఉపయోగించుకుంటుంది.

గూగుల్ రోజుకో సరికొత్త ఫీచర్ తో దినదినాభివృద్ది చెందుతోంది. మన్నటి వరకూ ఫోటో ద్వారా గూగుల్ మ్యాప్ యాక్టివ్ అయ్యే స్థాయి నుంచి నేడు ఎన్నికల పోలింగ్ బూత్ లను చూపించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకు గూగుల్ సేవలను ఉపయోగించుకుంటుంది. ప్రస్తుత యుగంలో గూగుల్ లేకుండా ఏ పని సాధ్యపడదు అన్న విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది.

అందుకే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ల వివరాలు, తమ పోలింగ్ బూత్ కేంద్రాలు తెలుసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎలక్షన్ కమిషన్ పోర్టల్లో వెళ్లి జనరల్ ఎలక్షన్స్-2023 ఎలక్టోరల్ రోల్స్ లో జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం ఎంచుకోవాలి. ఇందులో ప్రాంతీయ భాషతోపాటూ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇలా నమోదు చేసిన తరువాత ఆ నియోజకవర్గాల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, వాటి వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఈ వివరాలకు అనుసంధానం చేస్తూ గూగుల్ మ్యాప్ ను జోడించారు. ఇందులో ఓటరు ఐడీ నంబర్ కూడా కనిపిస్తుంది. తద్వారా తమ పోలింగ్ కేంద్రాలకు సులువుగా చేరుకునేలా సహాయపడుతుంది.

Share post:

లేటెస్ట్