మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్(Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన మూవీ ‘ఎల్2ఇ ఎంపురాన్ L2: Empuraan’. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈనెల 27న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొనగా.. తాజాగా మరో సెన్సేషనల్ అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేశారు. ఈ సినిమా ఐమాక్స్(IMAX) ఫార్మాట్‌లో విడుదల కానుండటం విశేషం. ఇది మలయాళ పరిశ్రమ నుంచి తొలి IMAX సినిమా కావడం గర్వకారణం అని మోహన్‌లాల్ స్వయంగా ప్రకటించారు.
ఎంతో గర్వంగా ఉంది: మోహన్‌లాల్
ఈ అద్భుతమైన అప్డేట్‌ను ప్రకటిస్తూ మోహన్‌లాల్ తన సోషల్ మీడియా(Social Media) ద్వారా ప్రత్యేక ప్రకటన చేశారు. “#L2E #Empuraan మలయాళ సినీ పరిశ్రమ నుంచి తొలి IMAX విడుదల కాబోతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. మలయాళ సినిమాలు & IMAXకి ఇది గొప్ప ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 27 నుంచిIMAX స్క్రీన్‌లపై ఈ మ్యాజిక్‌ని ఆస్వాదించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.
It gives us immense pride to announce that #L2E #Empuraan will be the first ever film from the Malayalam cinema industry to release on IMAX. We hope this is the beginning of a long and illustrious association between IMAX and Malayalam Cinema. Watch the spectacle unfold on IMAX… pic.twitter.com/yTyHCyietU
— Mohanlal (@Mohanlal) March 18, 2025
కీలక పాత్రల్లో సుకుమారన్, టొవినో థామస్
కాలా ‘లూసిఫర్ (Lucifer)’ లో అభిమానులను కట్టిపడేసిన ఖురేషీ-అబ్రామ్, స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో మోహన్‌లాల్ మళ్లీ అదరగొట్టనున్నారు. ఇక సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్(Tovino Thomas), అభిమన్యు సింగ్,ఇంద్రజిత్ సుకుమారన్, ఫాజిల్, సచిన్ ఖెడ్కర్, నైలా ఉష, శివాజీ గురువయూర్ ఇలా పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
@SajithS_Ofcl Bro 🤯🥶💥#L2E #EMPURAAN #Mohanlal #IMAX https://t.co/EvFi95HtSC
— Harisankar KJ 🦉 (@harisankar_kj) March 19, 2025






