ఓ ప్రేమజంట జీవితంలోని 8 సంవత్సరాల ప్రయాణం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా ‘8 వసంతాలు’ (8 Vasantalu). అనంతిక సనీల్‌కుమార్ (Ananthika Sanilkumar), హనురెడ్డి(Hanu Reddy), రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో ఫణీంద్ర నర్సెట్టి(Phanindra Narsetti) రూపొందించిన రొమాంటిక్ డ్రామా ‘8 వసంతాలు’ OTTలో సందడి చేయడానికి సిద్ధమైంది. జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్(Box Office) వద్ద మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కొంతమంది విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇందులో ప్రేమ, విడిపోవడం, స్వీయ-ఆవిష్కరణలు ఆసక్తికరంగా చూపించారు.

తను ప్రేమించింది.. ఓడిపోయింది.. ఎదిగింది..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని(Naveen Erneni), వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్(Netflix) దక్కించుకుంది. జూలై 11 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ‘తను ప్రేమించింది, ఓడిపోయింది, ఎదిగింది’ అనే ట్యాగ్‌లైన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తోంది. హెషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. థియేటర్లలో ఆశించిన విజయం సాధించకపోయినా, ఓటీటీలో ఈ చిత్రం కొత్త ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది.
8 vasantalu. Thanu preminchindhi, odipoyindhi… edhigindhi. ❤️
Watch 8 Vasantalu on Netflix, out 11 July in Telugu, Tamil, Kannada and Malayalam#8VasantaluOnNetflix pic.twitter.com/7mPsS6ZITx— Netflix India South (@Netflix_INSouth) July 7, 2025






